పండుగలు అంటే మంచి ఆహారం, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో జ్ఞాపకాలను సృష్టించుకోవడం.
కేరళ హార్వెస్టింగ్ ఫెస్టివల్ ( పంట కోత పండుగ) అయిన ఓనం సందర్భంగా శనివారం నటులు విక్కీ కౌశల్ మరియు మాళవిక మోహనన్ సరదాగా కలిశారు.
వీరిద్దరు చిన్ననాటి స్నేహితులు.
మాళవిక ఇంటి వద్ద సాంప్రదాయ ఓనమ్ సద్య (విందు) తో పండుగను జరుపుకున్నారు. విక్కీ కౌశల్ వారి ఇంటికి వచ్చి పండగ చేసుకున్నారు.
అనంతరం వేడుకలకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ, మాళవిక ఇలా రాసింది,
“చిన్ననాటి స్నేహితులు, కుటుంబం, రుచికరమైన ఆహారం మరియు కొన్ని నవ్వులు. ఓనమ్ గడపడానికి ఉత్తమ మార్గం! ”
మాళవిక పంచుకున్న చిత్రాలలో విక్కీ ను కౌగిలించుకుని పోజులిచ్చింది.
మాళవిక తండ్రి సినిమాటోగ్రాఫర్ కె. యు. మోహనన్
విక్కీ కౌశల్ తండ్రి యాక్షన్ డైరెక్టర్ షామ్ కౌశల్
వారి కుటుంబాలు ఎప్పటి నుంచి సాన్నిహిత్యంతో మెలగుతున్నాయి.