తెలంగాణలో పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే సీతక్క.. టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని కలిశారు.
రాకీ కట్టి ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.
ఏ పార్టీలో ఉన్న అన్నయ్య అనే బంధం మారదుగా అని వ్యాఖ్యానించారు ఆవిడ.
బాబు ఆశీర్వాదం లభించడం తనకు సంతోషంగా ఉందని ఆమె పేర్కొనడం గమనార్హం.
ఆదివారం.. రాఖీ పౌర్ణమి నేపథ్యంలో దేశం యావత్తు ఈ పండుగను ఘనంగా జరుపుకొంది. ములుగు శాసన సభ్యురాలు సీతక్క, తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు, మాజీమంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత.. చంద్రబాబును కలిసి రాఖీ కట్టారు. రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారిని ఆశీర్వదించారు.
పార్టీలకు, ప్రాంతాలకు అతీతమైన అన్నా చెల్లెలు అనుబంధం మాది @ncbn 🙏
ప్రతి ఒక్కరికీ రాఖీ పండుగ శుభకాంక్షలు🎉#Rakshabandhan #Rakhi pic.twitter.com/47hr27v4K8— Danasari Seethakka (@seethakkaMLA) August 22, 2021