యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం దేవర. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ ను 2024 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. దేవరతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. సైఫ్ అలీ ఖాన్, రమ్యకృష్ణ, షైన్ టామ్ చాకో, శృతి మరాఠే, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషించగా.. కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
రిలీజ్ దగ్గరపడుతుంటంతో ప్రచార కార్యక్రమాలకు చిత్రబృందం సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. దేవర విషయంలో మేకర్స్ 9 సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారనే టాక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి 9 అనేది ఎన్టీఆర్ లక్కీ నెంబర్. అందుకే ఆయన కార్లన్నిటికీ 9999 నెంబర్ ఉంటుంది. అయితే ఇప్పుడు దేవర కు సైతం 9 సెంటిమెంట్ గా మారుతుంది.
ఈ సినిమా ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉండగా.. సెప్టెంబర్ కు పోస్ట్ చేశారు. సెప్టెంబర్ అంటే క్యాలెండర్లో 9వ నెల. అలాగే 27న విడుదల తేదీగా ప్రకటించారు. 2+7 కలిపితే 9 వస్తుంది. ఇక దేవర ప్రీమియర్ షోలను అర్థరాత్రి 1.08 గంటలకు వేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 1+8 కలిపినా కూడా 9 వస్తోంది. ఇలా ఎటు చూసినా ఎన్టీఆర్ సినిమాకు 9 సంఖ్యాబలం ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
కాగా, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా రూ. 300 కోట్ల బడ్జెట్ తో దేవర పార్ట్ 1ను నిర్మించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఇండియా వైడ్ గా దేవరపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.