మహానాడు వేదికగా టీడీపీరాష్ట్ర అధ్యక్షుడు.. అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం కాగానే పార్టీ కార్యకర్తలదే అధికారమని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ లాగా.. టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదన్న అచ్చెన్న.. ప్రజల మనస్సుల్లో నుంచి పుట్టిన పార్టీ అని అన్నారు. మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వ నాశనం చేశారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో.. తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
పార్టీ కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులను ఒకే సంతకంతో తీసేస్తామని, అది కూడా తొలి సంతకమే కాబోతోందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలదే అధికారమని అని తెలిపారు. వైసీపీ చేపడుతోన్న బస్సుయాత్రలో వస్తోంది మంత్రులు కాదని.. బస్సు యాత్ర పేరుతో అలీబాబా దొంగలు వస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబును సీఎం చేయడానికి కార్యకర్తలు శపథం చేయాలన్నారు. అధికారం ఉన్నా.. లేకున్నా ప్రజల కోసమే టీడీపీ రాజకీయం చేస్తోందని తెలిపారు. గత మూడేళ్లుగా చంద్రబాబు మొదలుకుని.. సాధారణ కార్యకర్త వరకు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వైసీపీ లాగా.. టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదని.. ప్రజల మనసులో నుంచి పుట్టిన పార్టీ అని తెలిపారు.
టీడీపీని లేకుండా చేయడం జగన్ తాత, తండ్రి వల్ల కూడా కాలేదని వెల్లడించారు. రోడ్డెక్కడానికి భయపడే పరిస్థితి నుంచి రోడ్డెక్కి పోరాటం చేసే స్థితికి కార్యకర్తలు చేరారన్నారు. చంద్రబాబు ప్రజల్లోకి రాగానే రాష్ట్రం షేక్ అయిందని.. ఉత్తరాంధ్రలోనే కాదు.. చంద్రబాబు కడప వెళ్తే ఆ జిల్లానే దద్దరిల్లింద న్నారు. మహానాడు సభకు తమ పొలం ఇస్తామని ఒంగోలు సమీపంలోని గ్రామస్తులు ముందుకొచ్చారని అచ్చెన్నాయుడు తెలిపారు. మహానాడు సభకు స్టేడియం అద్దెకు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినా స్పందన లేదన్నారు.
టీడీపీ ప్రజల హృదయాల్లో ఉన్న పార్టీ అని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రైవేటు కార్యక్రమాలకు ఇచ్చే విధానం ప్రకారమే మహానాడు సభకు స్టేడియం అద్దెకు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినా స్పందన లేదన్నారు. సీఎం కార్యాలయం ఆదేశాలతో తలొగ్గిన కలెక్టర్.. సభకు స్టేడియం ఇవ్వబోమని తమకు లేఖ రాశారన్నారు. మహానాడు సభకు తమ పొలం ఇస్తామని గ్రామస్తులు ముందుకొచ్చారని తెలిపారు . దీనిని బట్టి.. ప్రజల హృదయాల్లో టీడీపీ ఎంతగా అల్లుకుపోయిందో స్పష్టం అవుతోందని చెప్పారు.