టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి అన్నగారు ఎన్టీఆర్.. తొలి మహానాడుకు పోటెత్తిన పార్టీ కార్యకర్తలు, అభిమానులను చూసి.. “నింగి ఒంగిందా.. నేల ఈనిందా.. అన్నట్టుగా వచ్చిన తెలుగు తల్లి ముద్దు బిడ్డలు“ అంటూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అచ్చం ఇప్పుడు అలానే రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు వేడుకలకు భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో మహానాడు ప్రాంగణం అంతా పూర్తిగా నిండిపోయింది. ఈ పరిస్థితిని చూసిన సీనియర్లు.. అన్నగారు గతంల చెప్పిన డైలాగును రిపీట్ చేసుకున్నారు.
టీడీపీ మహానాడుకు 20 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు లేకుండా వైసీపీ ప్రభుత్వం చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయినా జగన్ ప్రభుత్వ ఆంక్షలు మహానాడుపై పనిచేయలేదని అన్నారు. టూవీలర్స్, కార్లలో పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు వేడుకలు శనివారం రాజమండ్రిలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పాల్గొన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుందని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందని, రాజమండ్రిని పుష్కర వేళ రాజమహేంద్రవరంగా పేరు మార్చామని చంద్రబాబు తెలిపారు.
నారా లోకేష్ ఏమన్నారంటే..
త్వరలో రాయలసీమలో పాదయాత్ర పూర్తవబోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ అన్నారు. అదేరోజు రాయలసీమ రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని, ఇరిగేషన్, తాగునీరు, పరిశ్రమలు, ఉపాధి అంశాలతో రోడ్ మ్యాప్, రాయలసీమ ప్రజలు మావైపే ఉన్నారని అర్థమవుతోందని లోకేష్ అన్నారు. ఏపీ కంటే తెలంగాణ ఆదాయమే పెరుగుతోందని, 2019 లో ఏపీ కంటే తెలంగాణ ఆదాయం రూ.4 వేల కోట్లు అధికమన్నారు. జగన్ అసమర్థతతో ఆ వ్యత్యాసం 10 రేట్లు పెరిగిందన్నారు.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పేదలను సంపన్నులను చేసే పథకం పెడతామంటూ అధినేత @ncbn గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి మహానాడు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చంద్రబాబు గారు మహానాడు వేదికగా హామీ ఇచ్చారు.#Mahanadu2023 pic.twitter.com/W6K29XGpmJ
— Telugu Desam Party (@JaiTDP) May 27, 2023