మన రాష్ట్రానికి చెందిన ఆనందయ్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కరోనా నివారణ కోసం మందును రూపొందించిన ఆనందయ్య.. ప్రజలను దానిని ఉచితంగా పంచిపెడుతూ.. కరోనా కట్టడిలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. తనకు సాయం చేయాలంటూ.. ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
కానీ, మన ప్రభుత్వం మాత్రం ఆయనను పక్కన పెట్టింది. లాభం లేదనే కారణంగా.. రాజకీయ మైలేజీ ఉండదని అంచనాలు వేసుకున్న నేపథ్యంలో ఆనందయ్యను అస్సలు పట్టించుకోవడమే లేదు. కానీ, పొరుగు రాష్ట్రం తమిళనాడులో మాత్రం ఆనందయ్యకు ఎనలేని గౌరవ మర్యాదలు చేస్తున్నారు.
ఆనందయ్య మందుపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో కరోనాకు మందు తయారుచేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను అభినందించింది. ఈ సందర్భంగా ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్. కరుబాకరణ్, టీవీ తమిళ్ సెల్వీ సెల్యూట్ చేశారు.
డీఆర్డీవో తయారు చేసిన 2-డీజీ మందుపై విచారణ సందర్భంగా ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వాలు ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో విఫలమయ్యాయంటూ ఆనందయ్యపై అభినందనల వర్షం కురిపించారు.
ఆయుర్వేద వైద్యులను కేంద్రం ప్రోత్సహించాలని జస్టిస్ ఎన్. కరుబాకరణ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా భారతీయ ఎడిసన్గా పేర్గాంచిన జీడీ నాయుడును గుర్తు చేశారు. అలాంటి అత్యుత్తమ ఆవిష్కర్తలు కూడా ఉంటారని.. అందరూ రామర్ పిళ్లై లాంటి మోసగాళ్లు ఉంటారన్న ఆందోళన తగదన్నారు.
బయో ఇంధనం పేరుతో జనాలను మోసం చేసిన కేసులో రామర్ పిళ్లై అరెస్ట్ అయ్యాడు. మొత్తంగా చూస్తే.. మన ప్రబుత్వం వదిలేసిన ఆనందయ్యను తమిళనాడులోని మద్రాస్ హైకోర్టు కొనియాడడం.. సెల్యూట్ చేయడం.. సర్వత్రా ఆసక్తిగా మారింది. మరి ఇప్పటికైనా జగన్ మేల్కొని ఆనందయ్యను ప్రోత్సహిస్తారో లేదో చూడాలి.