• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వీడు ఖతర్నాక్: లగ్జరీ హోటళ్లను భలే మోసం చేశాడే

NA bureau by NA bureau
December 28, 2023
in Around The World, India, Top Stories, Trending
0
mrinank singh

mrinank singh

0
SHARES
143
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మోసాలకు పాల్పడుతూ ఎందరినో ముంచేసిన ఖతర్నాక్ ఒక యువ క్రికెటర్ ను   ఢిల్లీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అతగాడి బాధితుల జాబితాలో ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కూడా ఉండటం విశేషం. అతగాడు మోసాల చిట్టా పెరిగి.. చివరకు దేశం విడిచి పారిపోతుండగా పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. అతడ్ని విచారించిన వేళ.. అతడు చెప్పిన వివరాల్ని విన్న పోలీసులు సైతం షాక్ తినే పరిస్థితి.

 హరియాణాలోని ఫరీదాబాద్ కు చెందిన మృణాంక్ సింగ్.. గతంలో ఆ రాష్ట్ర అండర్ 19 జట్టుకు ఆడాడు. తర్వాతి కాలంలో  మోసాలకు అలవాటు పడిన అతను క్రికెట్ ఆడటం  మానేశాడు. 2014-2018 మధ్య కాలంలో ఒక ఐపీఎల్ జట్టుకు ఆడినట్లుగా చెప్పి.. పలువురు మహిళల్ని.. అంతర్జాతీయ బ్రాండ్లను మోసం చేశాడు. అక్కడితో ఆగకుండా విలాసవంతమైన హోటళ్లలో బస చేయటం.. తానో పాపులర్ క్రికెటర్ గా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడేవాడు.

ఢిల్లీలో ఒక ప్రముఖ హోటల్లో వారం పాటు బస చేసిన అతను.. హోటల్ బిల్లు రూ.5.53 లక్షలుకాగా.. ఆ మొత్తాన్ని చెల్లించకుండా వెళ్లిపోయాడు. బిల్లు మాటేమిటి? అని అడిగితే తన స్పాన్సర్లు చూసుకుంటారని బదులిచ్చాడు. అతడి మాటల్ని నమ్మిన బ్యాంక్ సిబ్బంది పేమెంట్ వివరాల్ని అతడికి షేర్ చేయగా.. రూ.2 లక్షలు ట్రాన్సఫర్ చేసినట్లుగా చెప్పి నకిలీ రశీదును హోటల్ సిబ్బందికి పంపాడు. అయితే.. తాము మోసపోయినట్లుగా గుర్తించిన హోటల్ యాజమాన్యం అతడి మీద పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో.. ఢిల్లీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

డిసెంబరు 25న హాంకాంగ్ వెళ్లేందుకు మృణాంక్ ఢిల్లీ ఎయిర్ పోర్టుకు రాగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలోనూ తాను సీనియర్ ఐఏఎస్ అధికారినంటూ మోసగించే ప్రయత్నం చేశాడు కనీ అతడి పప్పులు వారి వద్ద ఉడకలేదు. దీంతో.. ఇమ్మిగ్రేషన్ అధికారుల్ని అతడ్ని ఢిల్లీ పోలీసులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా అతడ్ని విచారించిన పోలీసులకు అతగాడు చెప్పిన వివరాలు విని అవాక్కు అయ్యారు.

తాను పోలీసు అధికారినంటూ కొందరిని.. ఐఏఎస్ అధికారిని అంటూఇంకొందరిని మోసం చేసిన అతను చివరకు టీమింియా క్రికెట్ జట్టు సభ్యుడు కమ్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ను కూడా మోసం చేసినట్లుగా గుర్తించారు. లగ్జరీ ఉత్పత్తులను అతి తక్కువ ధరలకు అందిస్తానని చెప్పి.. లగ్జరీ ఉత్పత్తుల వ్యాపారం చేస్తున్నట్లుగా చెప్పి బుట్టలో వేసుకున్నాడు. అతన్నినమ్మిన రిషబ్ అతడికి ఏకంగా రూ.1.63 కోట్ల మొత్తాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత తాను మోస పోయినట్లుగా గుర్తించి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న అతగాడి ఘన చరిత్ర తెలుసుకుంటున్న వారంతా అవాక్కు అవుతున్నారు.

Tags: luxury hotelsMRINANK SINGHrishab pant
Previous Post

పులివెందులలో జగన్ కాన్వాయ్ పై రాయితో దాడి

Next Post

ఇలా అయితే విశాఖ‌కు వెళ్ల‌లేరు:  ఏపీ హైకోర్టు

Related Posts

Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Load More
Next Post
andhrapradesh map

ఇలా అయితే విశాఖ‌కు వెళ్ల‌లేరు:  ఏపీ హైకోర్టు

Latest News

  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra