• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ కు ‘షాక్’…ఆ యాడ్ స్పూఫ్ తో పరువు తీసిన లోకేశ్

admin by admin
March 31, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
475
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా రివర్స్ పాలన జరుగుతోందని టీడీపీ నేతలు, విపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్న సంగతి తెలిసిందే. రివర్స్ టెండర్లంటూ పోలవరం మొదలు డ్రైనేజి కాలువల వరకు నిర్మాణ పనులన్నీ రివర్స్ లో సాగుతున్నాయని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విద్యుత్ చార్జీల విషయంలోనూ జగన్ రివర్స్ గేర్ వేయడంపై విపక్ష నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.  సీఎం అయిన తర్వాత 6 సార్లు విద్యుత్ చార్జీల‌ను పెంచిన జ‌గ‌న్ పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు.

జగన్ విద్యుత్ చార్జీల పెంపును జ‌గ‌న్ ఉగాదిబాదుడుగా లోకేశ్ అభివ‌ర్ణించారు. విద్యుత్ చార్జీల పెంపుతో జ‌గ‌న్‌కే షాక్ కొట్టిన‌ట్టుగా ఉన్న ఓ ఫొటోను లోకేశ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. .షాక్ లగా…షాక్ లగా…అంటూ ఓ ప్రముఖ కంపెనీ యాడ్ ను ఇమిటేట్ చేసేలా జగన్ కు షాక్ తగిలి జుట్టంతా పిచుకగూడులా ఉన్న ఫొటోను త‌న పోస్ట్‌కు యాడ్ చేశారు. ఇప్ప‌టికే పెట్రోల్ ఏపీలోనే అత్య‌ధిక‌మ‌న్న విష‌యాన్ని  ప్ర‌స్తావించిన లోకేశ్.. జ‌నంపై మ‌రో భారం వేస్తూ జ‌గ‌న్ స‌ర్కారు విద్యుత్ చార్జీల‌ను పెంచింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓ ప‌క్క పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. మ‌రో ప‌క్క విద్యుత్ చార్జీలు..బాదుడే బాదుడు.. వీర బాదుడు అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు.

‘‘జ‌గ‌న్‌రెడ్డి మాట ఇచ్చాడంటే, దానికి రివ‌ర్స్ చేస్తాడంతే! మాట త‌ప్పుడుకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌, మడ‌మ తిప్పుడుకి ఐకాన్ @ysjagan. క‌రెంటు చార్జీలు బాదుడే, బాదుడంటూ నాడు జ‌గ‌న్ తీసిన దీర్ఘాలు స్థాయిలోనే మూడేళ్ల‌లో కరెంటు చార్జీలు భారీగా పెంచి జ‌నానికి షాక్ కొట్టించారు. అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.57  పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లపైన వారికి యూనిట్‌కు 55 పైసలు పెంచ‌డం ఏ రేంజ్ బాదుడో జ‌గ‌న్‌రెడ్డే చెప్పాలి. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ప్రజలకు వేసవి షాక్ ఇచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. షాక్ ఇంత చాలునా…ఇంకా కొంచెం పెంచానా అంటూ జగన్ చేతుల్లో కరెంటు తీగలు పట్టుకున్న ఫొటో వైరల్ అయింది.

Tags: ad spoof on jaganap cm jaganelectricity charges in aplokesh satires on jagan
Previous Post

మంచు మనోజ్ కు పోలీసుల షాక్

Next Post

సీఎం ఇంటిపై దాడి..8 మంది అరెస్టు

Related Posts

Movies

మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌

May 24, 2025
Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
Load More
Next Post

సీఎం ఇంటిపై దాడి..8 మంది అరెస్టు

Please login to join discussion

Latest News

  • మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra