• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జనసేన తో పొత్తుపై లోకేష్ కీలక వ్యాఖ్యలు

admin by admin
September 15, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
104
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తాయని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ …జనసేన, టీడీపీల పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీల పొత్తు రాష్ట్ర చరిత్రలో కీలక నిర్ణయం అని, కలిసికట్టుగా వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతామని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎటువంటి భవిష్యత్ కార్యచరణపై చంద్రబాబు, పవన్ లు చర్చించారని అన్నారు. త్వరలో టీడీపీ, జనసేన జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తామని లోకేష్ ప్రకటించారు. టీడీపీ, జనసేన కలిసి వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకు యుద్ధానికి సిద్ధమని లోకేష్ ప్రకటించారు.

చట్టాలను చుట్టాలుగా మారిస్తే సివిల్ వార్ మొదలు పెట్టాల్సిందేనని, వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం మొదలుబెట్టాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ తాను కలిసి నిర్ణయించుకున్నామని లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారని, ప్రజల తరఫున పోరాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై, టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. యువగళంపై దాడి చేసి టీడీపీ శ్రేణులుపైన కేసులు పెట్టారని మండిపడ్డారు. అమరావతి రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అరాచకాలపై పోరాడిన చంద్రబాబు పై హత్యాయత్నం కేసు పెట్టారని నిప్పులు చెరిగారు. జైలు లోపల ఉన్నా జగన్ కు చంద్రబాబు చెమటలు పట్టిస్తున్నారని అన్నారు.

జగన్ ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. తన తల్లిని అవమానించారని, తనను దూషించారని, బ్రాహ్మణిపై కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ప్యాకేజీ తీసుకున్నట్టు ఒక్క ఆధారమైనా చూపాలని, నిరాధార ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటేనని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేతిలోనే ఇంటెలిజెన్స్, సిఐడి ఉన్నాయని, దర్యాప్తు చేసి ఆధారాలు బయటపెట్టాలని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వంలో అందరూ బాధితులుగా మారారు. టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ మొదలు పెడతాం. వైసీపీ చేసే ప్రతి తప్పును ప్రజా క్షేత్రంలో ఎండగడతాం – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గారు #TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu… pic.twitter.com/Lu28JfyZ4J

— Telugu Desam Party (@JaiTDP) September 14, 2023

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి – జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారు #TDPJSPTogether#APvsJagan#IAmWithBabu #PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/nqCKOcQIjM

— Telugu Desam Party (@JaiTDP) September 14, 2023

విజన్ 2020తో సైబరాబాద్ అనే ఒక కొత్త నగరాన్ని నిర్మించిన ఘనత చంద్రబాబు గారిది. లక్షల కోట్ల సంపద సృష్టించిన చంద్రబాబు గారిపై రూ.317 కోట్ల స్కాం అంటూ అభియోగం మోపడం బాధాకరం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/8k5XC0XMyZ

— Telugu Desam Party (@JaiTDP) September 14, 2023

Tags: allianceBalakrishnaChandrababuLokeshpawan kalyantdp janasena alliance
Previous Post

వ‌రస పెట్టి 10 రోజులు వైసీపీకి ద‌బిడిదిబిడేనా?!

Next Post

పవన్ ప్యాకేజీ స్టార్ అయితే.. వైఎస్ మాటేంది?

Related Posts

Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Andhra

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Load More
Next Post
jagan and ysr

పవన్ ప్యాకేజీ స్టార్ అయితే.. వైఎస్ మాటేంది?

Latest News

  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra