లోకేష్ పూర్తిగా దిగిపోయారు. జనంతో జనంలో కలిసిపోతున్నారు. రాష్ట్రం సమస్యలతో అతలాకుతలం అవుతుంటే…. రెడ్లకు పదవులు, ఓటర్లకు సంక్షేమ పథకాలు అన్న నినాదం తప్ప ఇంకో మాట మాట్లాడకుండా జగన్ ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దేశపు రథసారథులు అయిన రైతుల కోసం నారా లోకేష్ కదిలారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
మొన్న తూర్పుగోదావరిలో పర్యటించిన లోకేష్ అక్కడి సమస్యలను లోకం దృస్టికి తెచ్చారు. తాజాగా అనంతపురం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా అలంపూర్ టోల్ గేట్ వద్ద టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఈరోజు లోకేష్ గుంతకల్ నియోజకవర్గంలోని కరిడికొండ గ్రామంలో పర్యటిస్తారు. అనంతరం అక్కడి నుంచి తాడిపత్రి నియోజకవర్గం మిడుతూరు గ్రామం వెళ్తారు. అనంతరం శింగనమల నియోజకవర్గంలోని రాందాస్ పేట గ్రామంలో పర్యటించి తర్వాత రాప్తాడు నియోజకవర్గంలోని కామారుపల్లి గ్రామానికి వెళ్తారు.
ఈ రోజు పర్యటించే 4 నియోజకవర్గాల్లో ఒకటి జేసీ నియోజకవర్గం, మరోటి పరిటాల నియోజకవర్గం కావడం గమనార్హం.