జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో నిర్మాణ రంగం కుదేలైన సంగతి తెలిసిందే. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా…ఆన్ లైన్ లో ఇసుక అమ్మకం అంటూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇసుక కొరతను సృష్టించిన ఘనత జగన్ దే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక, దేశంలో ఎక్కడ గంజాయి కేసులు పట్టుబడ్డా…దాని మూలాలు ఏపీలో ఉండడం కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే తాడేపల్లిలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్…జగన్ పై ఫైర్ అయ్యారు.
దేశంలోనే చెత్త ముఖ్యమంత్రుల జాబితాలో జగన్రెడ్డి నెంబర్వన్ అని లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్రెడ్డి నివాసానికి కూతవేటుదూరంలోనే మత్తుపదార్థాలను విచ్చలవిడిగా అమ్ముతున్నారని, అయినా సీఎంకు పట్టదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు దొంగల భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు తనపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విషప్రచారం చేశారని, ఈ రోజు ఆయన నియోజకవర్గానికి గెస్ట్ లెక్చరర్ గా మారారని ఎద్దేవా చేశారు.
పేదవాళ్ల ఇళ్లను నిర్థాక్ష్యిణ్యంగా పీకేయిస్తానని తనపై ఆళ్ల దుష్ప్రచారం చేశారని, నేతు ఆ పనిని ఆయనే చేస్తూ అసలురూపాన్ని బట్టబయలు చేసుకున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలో ఇసుక రీచ్లున్నా.. ఇసుక అందుబాటులో లేదని, ఆ ఇసుకంతా ఎక్కడికి వెడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక ధందాలో కమీషన్లను ఎమ్మెల్యే, మంత్రి మొదలు ఇంకా ఎంతమంది పంచుకుంటున్నారని లోకేశ్ ప్రశ్నించారు.