• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంద్రబాబు గెడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరు…లోకేష్ ఫైర్

admin by admin
March 16, 2021
in Uncategorized
0
0
SHARES
119
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ వైసీపీ నాయకులు నానా యాగీ చేస్తున్నసంగతి తెలిసిందే. అమరావతి భూముల్లో టీడీపీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ వైసీపీ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనికితోడు, అమరావతిలో ఇన్ సైర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ హైకోర్టు కూడా చెప్పింది.

అయినా, వైసీపీ అధినేత, సీఎం జగన్ మాత్రం …ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ నోటీసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ లోకేష్ స్పందించారు.

ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ నిప్పులు చెరిగారు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని నమ్మించడానికి  జ‌గ‌న్ నానా తిప్పలు పడుతున్నారని, అవి చూస్తే నవ్వొస్తోందని లోకేష్ ఎద్దేవా చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టినా జగన్ పాత పాటే పాడుతున్నారని సెటైర్లు వేశారు. 21 నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారని దుయ్యబట్టారు.

సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరంటూ సవాల్ విసిరారు.అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, దైవభూమి తనని తానే కాపాడుకుంటుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడాన్ని టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. కక్ష సాధింపుల్లో భాగంగానే చంద్రబాబుకు నోటీసులిచ్చారని మండిపడ్డారు.

రాజధాని రైతుల ఆమోదంతోనే అసైన్డ్ భూములను నాటి ప్రభుత్వం తీసుకుందన్నారు. దీనిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆర్కే ఎస్సీనా? లేక ఎస్టీనా? ఆయన ఫిర్యాదుతో కేసు ఎలా పెడతారని అచ్చెన్న ప్రశ్నించారు. అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని అచ్చెన్న మండిపడ్డారు.

Tags: AndhraPoliticsTopStories
Previous Post

నిమ్మగడ్డకు షాక్…ఎంపీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టు కీలక తీర్పు

Next Post

ఆంధ్రులపై మోదీకి కక్షా?

Related Posts

Uncategorized

మ్యాగజైన్ స్టోరీ: చట్టంతో బోరుగడ్డ చెలగాటం

May 5, 2025
Uncategorized

క‌స్ట‌డీలో ట్విస్ట్‌.. పీఎస్ఆర్ ఆంజనేయులుకు అస్వస్థత!

April 27, 2025
Uncategorized

రేవంత్ కు చుక్కెదురు..ఏప్రిల్ 7 వరకు కోర్టు స్టే

April 3, 2025
Uncategorized

భార‌త్ ఆలోచ‌న ప్ర‌పంచ‌మే ఆస‌క్తిగా చూస్తోంది: పీఎం మోదీ

March 30, 2025
Uncategorized

ప‌వ‌న్ హైంద‌వ డ్రామా… లోకేష్ నాట‌కం: బీసీవై రామ‌చంద్ర యాద‌వ్ ఆగ్ర‌హం

March 12, 2025
Crime In India
Uncategorized

కేంద్ర మంత్రి కూతురికి పోకిరీ ల వేధింపులు.. !!

March 2, 2025
Load More
Next Post
vizag steel privatization

ఆంధ్రులపై మోదీకి కక్షా?

Please login to join discussion

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra