ఇటీవల కాలంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ తరచుగా.. `వైనాట్ 175` నినాదం ఎంచుకున్న విషయం తెలిసిందే. ఈ నినాదాన్ని.. ఆయన తరచుగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని 175 స్థానాల్లోనూ విజయం చేకూర్చే దిశగా ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఆయన చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు ఇదే నినాదంతో టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ఉతికేశారు. వైనాట్ అంటూ.. అనేక సమస్యలను ప్రస్తావించారు.
`వై నాట్ 175` అంటున్న జగన్.. వీటికి సమాధానం చెప్పాలని నారా లోకేష్ ప్రశ్నించారు. వై నాట్ స్పెషల్ స్టేటస్..? వై నాట్ జాబ్ క్యాలెండర్..? వై నాట్ సీపీఎస్ రద్దు..? వై నాట్ పోలవరం…? వై నాట్ విశాఖ రైల్వే జోన్.? అని నారా లోకేష్ ప్రశ్నించారు. వీటి గురించి కూడా మాట్లాడాలని నిలదీశారు. పగటి కలలు కంటూ ఉండే జగన్ రెడ్డి పరదాలు లేకుండా బయటకు వస్తే, ప్రజల్లో ఆయన పాలనపై గూడుకట్టుకున్న ఆవేదన తెలుస్తుందని విమర్శించారు.
జగన్ పాలనలో ఏపీ లాండ్, శాండ్, వైన్, మైన్ దోపిడీలో నెంబర్ వన్ అయ్యిందని నారా లోకేష్ దుయ్యబ ట్టారు. డ్రగ్స్, గంజాయి, అప్పుల్లో నెంబర్ వన్ చేశారని విరుచుకుపడ్డారు. బాబాయ్ వివేకానందరెడ్డిని చంపింది అబ్బాయేనని అన్నారు. పెంచుతూ పోతానని హామీ ఇచ్చిన జగన్.. పెట్రోల్, డీజిల్ ధరలు,పన్నులు పెంచుకుంటూ పోతున్నాడని విమర్శించారు.
పీల్చే గాలిపైనా జగన్ పన్ను వేస్తాడని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ప్రతీ ఇంటికి వలంటీర్ వచ్చి మిషన్ మూతికి పెట్టి ఉఫ్ ఊదమంటారు..ఎంత గాలి పీల్చారో చూసి పన్ను వేస్తారని హేళన చేశారు. రాయల సీమకి పట్టిన శని జగన్ అని లోకేష్ వ్యాఖ్యానించారు. సీఎం అయిన నుంచీ అడుగడుగునా మోసం చేశాడన్నారు. హంద్రీనీవా ఆపేశాడు..అమర్ రాజా కంపెనీని పక్క రాష్ట్రానికి పంపేశాడని, రిలయన్స్ ని తరిమేశాడని విమర్శలు గుప్పించారు. కాగా, యువగళం పాదయాత్ర 12 రోజులు పూర్తి చేసుకుంది.
https://twitter.com/malati_reddi/status/1622974718885376002