అవకాశం దొరికినపుడల్లా నారా లోకేష్ బీజేపీ – వైకాపా బంధాన్ని ఎండగడుతున్నారు. జగన్ బీజేపీ ఒత్తిడికి తలొగ్గి ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని ప్రజల ముందు పెడుతున్నారు. తాజాగా ప్రత్యేక విమానంలో జగన్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ట్విట్టర్,ఫేస్ బుక్ వేదికగా జగన్ ఢిల్లీ పర్యటన పై ఒపీనియన్ పోల్ నిర్వహిస్తున్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ రెడ్డి తానే తలదించుకుని ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నదెందుకు? అన్న పోల్ ప్రశ్న.
దీనికి ఆయన ఇచ్చిన ఆప్షన్స్…
1)ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి తనపై ఉన్న 31 కేసుల విచారణ జాప్యానికి
2)రివర్స్ టెండరింగ్ లో బాబాయ్ మర్డర్ ని గుండెపోటుగా చిత్రీకరించడానికి
3)మూడురాజధానుల పేరుతో అమరావతిని అంతం చెయ్యడానికి
4) 151 దేవాలయాలపై జగన్ రెడ్డి చేసిన దండయాత్ర ఆధారాలు బయటపెట్టొద్దని వేడుకోవడానికి
మరి జనం ఎలా స్పందిస్తారో చూడాలి.