తండ్రి నుంచి మొదలుకుని వైఎస్ కుటుంబం మొత్తం పదేపదే చంద్రబాబు మీద గత పాతికేళ్లుగా కేసులు వేస్తూనే ఉన్నారు. అవి వీగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కూడా విజయమ్మ పిటిషను వేసి సుప్రీంకోర్టు తిట్లు తిని తన పిటిషన్ ను ఉపసంహరించుకుంది.
తాజాగా ఇంకోసారి జగన్ చంద్రబాబు మీద కేసు వేయడానికి ప్రయత్నించాడు. అమరావతి భూముల్లో దళితుల అసైన్డ్ భూముల కాన్సెప్ట్ మీద బాబుకు సీఐడీ నోటీసు ఇచ్చి ఏపీ సీఐడీ చంద్రబాబును విచారిద్దాం అనుకుంది.
కానీ దళితుల కేసును దుర్వినియోగం చేస్తూ ఒక రెడ్డి కులస్తుడు ఎస్టీ ఎస్సీ కేసు పెట్టడం, దానిని పోలీసులు నమోదు చేయడం, అసలు ప్రాథమిక సమాచారం, బాధితుల ఫిర్యాదు లేకుండా కేసు పెట్టడాన్ని చంద్రబాబు కోర్టుకు నివేదించడం.. కోర్టు ఏపీ సీఐడీకి, జగన్ సర్కారుకు మొట్టికాయలు వేయడం వేగంగా జరిగిపోయింది.
దీనిపై నారా లోకేష్ తాజాగా తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ… నీ బాబు వల్లే కాలేదు, నువ్వెంత? అని వ్యాఖ్యానించారు చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం, కోర్టులో చీవాట్లు తిని తోకముడిచి పారిపోవడం మీ కుటుంబానికి అలవాటేగా అని ఎద్దేవా చేశారు.
Total 26 enquiry committees by YSR
Proved nothing… pic.twitter.com/WP4ijBFMQb— Darshini???? (@Darshini016) March 19, 2021