సీఎం జగన్ పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పెగాసెస్ పై హౌస్ కమిటీ విచారణకైనా, జూడిషియరీ కమిటీ విచారణకైనా, సీబీఐ విచారణకైనా సిద్ధమని లోకేష్ నిప్పులు చెరిగారు. పెగాసస్ వ్యవహారంపై మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా..? లేదా..? అనే క్లారిటీ ఇప్పటికీ లేదని దుయ్యబట్టారు. దీదీ బెెంగాలీలో మాట్లాడిన వీడియోలో అసలు చంద్రబాబు ప్రస్తావన లేదని బెంగాలీ తెలిసిన నా స్నేహితుడు చెప్పాడని లోకేష్ మండిపడ్డారు.
బాబాయ్ హత్య విషయంలో, కల్తీ సారా, జే బ్రాండ్ల మరణాల విషయంలోనూ విచారణకు జగన్ రెడ్డి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. వ్యక్తిగత విషయాలు వినే అలవాటు తమకు లేదని, కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందేమోనని, అందుకే అంబటి రాసలీలలు బయట పడ్డాయేమోనని లోకేష్ నిప్పులు చెరిగారు. సారా మరణాలపై టీడీపీ పోరాడుతుంటే వాటిని సహజ మరణాలుగా సీఎం తీసిపారేయడం బాధాకరమని చెప్పారు. జగన్ సర్కార్ లో ఉన్న మద్యం బ్రాండ్లు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకర రసాయనాలున్నాయని ఒక సామాజిక కార్యకర్త చేయించిన డీప్ కెమికల్ అనాలిసిస్ తేలిందని, త్వరలోనే ఆ రిపోర్టులు బయట పెడతామని వెల్లడించారు.
జగన్ మోహన్ రెడ్డి కాదని, జగన్ మోసపు రెడ్డి అని పిలిచేది ఇందుకేనని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలకంటే మరేదైనా పెద్ద సమస్య ఉందా..?
మమతా బెనర్జీ స్టేట్మెంట్ అంటూ పెగాసెస్ సాఫ్ట్ వేర్ పై సభలో చర్చ పెట్టారని, మండలి బిజినెస్ లేకుండానే పెగాసెస్ పై చర్చ పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తుదారుకు రిప్లై ఇచ్చారని, వ్యక్తులకు.. ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారని గుర్తు చేశారు.
కల్తీ మద్యంపై చర్చ పెట్టడం లేదని, కానీ, పెగాసస్ పై మాత్రం వెంటనే చర్చ పెట్టారని, ఏమన్నా అంటే 151 మంది ఉన్నారటున్నారని, భవిష్యత్తులో వైసీపీకి 15 మంది ఉండని పరిస్థితి వస్తుందని లోకేష్ జోస్యం చెప్పారు. అమరావతిలో ఎకరాలు కొన్నానని ప్రచారం చేశారని, మూడేళ్లయినా…ఒక్క సెంటు భూమి కొన్నానని నిరూపించగలిగారా? అని నిలదీశారు. చంద్రబాబు వ్యవస్థలన్ని, చట్టాలను అతిక్రమించబోరని, అందుకే మూడేళ్ల నుండి ఎన్ని విచారణలు చేసుకున్నా జగన్ రెడ్డి పీకిందేమీ లేదని ఎద్దేవా చేశారు.