ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అధిరిపోయే సవాల్ విసిరారు. ‘తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నాను నాకు నా కుటుంబానికి వివేకానంద రెడ్డి హత్యతో సంబంధం లేదు. ఇదే విధంగా జగన్ కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా వివేకానంద రెడ్డి హత్యతో సంబం ధం లేదని ప్రమాణం చేయగలడా?’ అని నారా లోకేష్ నిలదీశారు. యువగళం పాదయాత్రలో దూకుడుగా ఉన్న నారా లోకేష్.. చంద్రగిరి నియోజకవర్గంలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
నేనే మైక్ ఇచ్చేస్తా!!
తన గొంతు నొక్కాలని.. తన పాదయాత్రను ముందుకు సాగకుండా చేయాలని భావిస్తున్న సీఎం జగన్ తన మైక్ లాగేసుకుంటున్నాడని.. అయతే.. జగన్ కు రివర్స్ ఆఫర్ ఇస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు. ‘నా మైకును నేనే స్వచ్ఛందంగా సరెండర్ చేస్తా. జగన్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఇస్తాడా? జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాడా? 45 సంవత్సరాల నిండిన బీసీ ఎస్టీ ఎస్సీలకు పెన్షన్ ఇస్తాడా? ఇస్తానంటే నా మైకు సరెండర్ చేస్తా’ అని అన్నారు.
జగన్.. జలగ్!!
జగన్ జలగలాంటివాడని.. జలగ రక్తం పిలిచినట్టే నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ అన్ని ధరలు పెంచి పీల్చేస్తున్నాడని లోకేష్ విమర్శించారు. వలంటీర్లను పంపి ఎంత గాలి పీలుస్తున్నారో కొలిచి, మనం పీల్చే గాలికి కూడా పన్ను విధించగలిగినవాడు జగన్ అని పేర్కొన్నారు. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి పూలాభిషేకం చేసిన వైసీపీ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగదని దుయ్యబట్టారు.
జగన్ ఐరన్ లెగ్
జగన్‌ది ఐరన్ లెగ్ అని నారా లోకేష్ విమర్శించారు. జగన్ ప్రభుత్వంలోకి రాగానే బోటు ప్రమాదంలో 51 మంది.. ఎల్జీ పాలిమార్లో పదిమంది. అన్నమయ్య డ్యాంలో 62 మంది ప్రాణాలు కొట్టుకు పోయాయని నారా లోకేష్ ఆరోపించారు. రాయలసీమకు పట్టిన శని జగన్ అని నారా లోకేష్ విమర్శించారు. అప్పర్ తుంగభద్ర కడితే రాయలసీమ రాళ్ల సీమవుతుందని.. అయినా ఇక్కడ వైసీపీ ఎంపీలు ఢిల్లీలో నోరు మెదపడం లేదన్నారు.