జగన్ ని డీల్ చేసే విధానంలో చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ తండ్రి బాటలో జగన్ బాటలోనే సమాధానం చెబుతున్నట్లు ఇటీవల పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.
జగన్ గుట్టును రట్టు చేసే ఏ అవకాశాన్ని నారా లోకేష్ వదులుకోవడం లేదు. జగన్ పాలనపై ప్రతి ఒక్కరికీ ఆగ్రహం ఉన్నా… చాలామంది గొంతు విప్పలేకపోతున్నారు. కారణం… జగన్ అభిమానులు వైసీపీ నేతలు ఫోన్లు చేసి బూతులు తిట్టడం, బెదిరించడం చేస్తున్నారట. దీంతో ఎక్కడ వారి బెదిరింపులు భరించాల్సి వస్తుందో అన్న భయంతో చాలామంది ప్రశ్నించడం మానేశారట.
అయితే… ఈ వ్యవహారాన్ని బయట్ట బయలు చేస్తూ నారా లోకేష్ వేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. గతంలో చిత్తూరుకు చెందిన ఓం ప్రతాప్ అనే వ్యక్తి మద్యం క్వాలిటీ, రేట్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏమైందో గాని రెండ్రోజులకే అతను ఆత్మహత్య చేసుకున్నారు.
తాజాగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మరో వ్యక్తి ఇటీవలే ప్రశ్నించాడు. అంతే మరుసటి రోజు అతను ఆత్మహత్యకు గురయ్యాడు. దీనిపై నారా లోకేష్ స్పందించారు.
ప్రశ్నిస్తే చంపేస్తాడు నయా నియంత @ysjagan.25 వేల కోట్ల లిక్కర్ మాఫియాని ఎండగట్టినందుకు చిత్తూరు జిల్లాలో ఆటో డ్రైవర్ ఓం ప్రతాప్ ని చంపేశారు.ఇప్పుడు ప్రకాశం జిల్లా,బెస్తవారపేట మండలం,శింగరపల్లె గ్రామంలో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదంటూ స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నించిన వెంగయ్యని చంపేశారు.ఇవి ప్రభుత్వ హత్యలే.చెత్త పాలనని ప్రశ్నించిన వారిని చంపి ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కేసు క్లోజ్ చెయ్యడం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయానికి నిదర్శనం.వైకాపా రౌడీ మూకలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి.
అయితే, ఇది వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేను సమస్యల మీద ధైర్యంగా నిలదీసిన వ్యక్తి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అతను ఆత్మహత్యకు పాల్పడినా.. అది ఎమ్మెల్యే వర్గీయుల బెదిరింపుల వల్లే అని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. సమస్యల గురించి అడిగితే ప్రాణాలు పోవాల్సిందేనా అని ప్రశ్నించారు. వెంగయ్య నాయుడు మృతికి బాధ్యులైన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేయాలని పవన్ డిమాండ్ చేశారు.