ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేస్తే పోలీసు బలగంతో అణిచివేసి ప్రజా వ్యతిరేకతను దాచిపెట్టాలనుకుంటున్నారు జగన్.
అది ఎన్నటికీ సాధ్యమయ్యే పని కాదు.
అయితే, ఇటీవల తరచుగా వివాదాస్పదం అవుతున్న ఒక విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రభుత్వ విధానాలపై నిరసనలు చేసేవారిని అరెస్టు చేసేటపుడు అక్కడికి వస్తున్న వారు పోలీసులో కాదో తెలియడం లేదు.
వైసీపీ కార్యకర్తలు, పులివెందుల రౌడీలు పోలీసు డ్రెస్సుల్లో వస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.
ఇలాంటి అనుమానానికి కారణం ఏంటంటే…. పోలీసుల చొక్కాపై ఉండాల్సిన నేమ్ ప్లేట్ వారికి ఉండటం లేదు.
ఐడీ కార్డు చూపమన్నా కూడా వారు చూపడం లేదు.
మరి అలాంటపుడు ఎవరు వీళ్లు, నేమ్ ప్లేట్ ఎందుకు లేదు అని అందరూ అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఈరోజు ఏకంగా లోకేష్ ను అరెస్టు చేసిన సమయంలో కూడా కొందరికి నేమ్ ప్లేట్లు లేకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది…