అనంతపురంలో పర్యటించిన నారా లోకేష్ స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల మోటార్లకు కనుక మీటర్లు బిగిస్తే ఉద్యమం మొదలవుతుంది. అది కూడా అనంతపురం నుంచే ఉద్యమం మొదలవుతుందని లోకేష్ హెచ్చరించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అన్యాయం అయిన ప్రతి రైతుకు న్యాయం చేశాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్నాం. కానీ జగన్ రెడ్డి వచ్చాక 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కానీ జగన్ రెడ్డి వారిని అసలు పట్టించుకోవడం లేదు.జగన్ రెడ్డీ గాల్లోంచి నేల్లోకి రా. నువ్వు పాదయాత్ర చేసిన చోట పరిస్థితులు తెలుసుకో. మళ్లీ తిరుగు. ప్రజల కష్టాలు తెలుస్తాయి అన్నారు.
కరిడికొండ (గత్తి, అనంతపురం) ప్రాంతంలో పొలాల్లోనే కుళ్లిపోయిన వేరుశనగ పంటను లోకేష్ పరిశీలించారు. రైతులు సర్వం కోల్పోయారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అండ లేదు. ప్రభుత్వం ఉందా అన్న అనుమానం వచ్చేలా ఉందీ జగన్ పాలన అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. గాల్లో తిరిగితే రైతుల కష్టాలు తెలుస్తాయా? రైతులను కలిస్తే తెలుస్తాయి. పంట నష్టపోయిన ప్రతి రైతుకు 25 వేలు ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు.
17 నెలలుగా రైతులకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ఏ హామీని జగన్ అమలు చేయలేదని నారా లోకేష్ విమర్శించారు. ఇవాలో రేపో చేతికి అందాల్సిన పంట నేలపాలైతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా… జగన్ అని లోకేష్ ప్రశ్నించారు. ఇన్ని కష్టాల్లో ఉన్న రైతులకు మీకు అధికారం చేతికి రాగానే మీటర్లతో రైతుల చేతులు కట్టేసే ప్రయోగం చేస్తున్నారు అన్నారు. లోకేష్ వెంట జేసీ ప్రభాకర్ రెడ్డి, పవన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు ఉన్నారు.