గత ఏడాది ఎవరినీ సంప్రదించకుండా లాక్ డౌన్ పెట్టేసి కోట్లాది ప్రజలను ఇబ్బంది పెట్టిన ప్రధాని మోడీ… అది పూర్తిగా విఫలం కావడంతో విమర్శల పాలయ్యాడు.
అయితే, మోడీ ఎవరి విమర్శలు పట్టించుకునే మొహమాటం లేని మనిషి కాబట్టి అలా నెట్టుకుపోయారు.
తాజాగా మళ్లీ ఇపుడు కోవిడ్ గతం కంటే ఎక్కువగా, తీవ్రంగా ఉంది. అయినా లాక్ డౌన్ పెట్టలేదు.
కానీ జనాల్లో లాక్ డౌన్ పెడతారు అన్న భయం మాత్రం ఉంది.
ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఇంతవరకు ఎందుకు పెట్టలేదు అన్న అనుమానాలున్నాయి.
దానికి కారణం ఎన్నికలే.
మోడీకి బీజేపీ నాయకులకు అధికారం కంటే ఏదీ ముఖ్యం కాదు.
అందుకే కోవిడ్ ఇంత ఉదృతంగా ఉన్నా కూడా ఎన్నికలు ఆపకుండా నిర్వహిస్తున్నారు.
మే 2న 5 రాష్ట్రాల ఫలితాలు, ఉప ఎన్నికల ఫలితాలు వస్తాయి.
అపుడు లాక్ డౌన్ పెడతారు. ఎవడి చావు వాడు చావండి వదిలేస్తారు. అందుకే అంటారు మోడీ ఏం చేసినా దాని వెనుక రాజకీయం ఉంటుంది.
ఈరోజు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. అంటే మే 2 తర్వాత లాక్ డౌన్ గ్యారంటీ అన్నమాట.