జగన్ పాలనలో టీడీపీ నేతలపై, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలే టార్గెట్ గా వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్న వైనం సంచలనం రేపుతోంది. ఏకంగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై, టీడీపీ కార్యాలయాలపై, రోడ్ షోలో చంద్రబాబు వాహనంపై దాడులు కలకలం రేపాయి.
ఇక, ప్రతిపక్ష నేతలపై దాడులు చేసిన వారికి పదవులు కట్టబెట్టడం, బూతులు తిట్టిన వారికి ప్రమోషన్లు ఇవ్వడం జగన్ సర్కార్ కు అలవాటైంది. జోగి రమేష్..కొడాలి నాని వంటి నేతలు ఈ కోవలోకే వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక, ఇటీవల పుంగనూరులో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం, లోకేష్ పర్యటనలో సైతం గందరగోళం రేపేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలు రాష్ట్రంలో కక్షా రాజకీయాలు ఏ స్థాయికి చేరాయో అద్దం పడుతున్నాయి.
చంద్రబాబు, లోకేష్ ల భద్రతపై కేంద్రం కూడా ఆరా తీసిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసకోవచ్చు. గత ఏడాది నవంబరులో చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన రాళ్లదాడి ఘటనపై ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ వివరణ కోరడం తెలిసిందే. ఈ క్రమంలోనే గత నాలుగున్నరేళ్లలో చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు, టీడీపీ ఆఫీసులపై ఎన్ని సార్లు దాడులు చేశారో వివరాలు వెల్లడిస్తున్న ఓ పోస్ట్ ట్విట్టర్ లో వైరల్ అయింది.
4.5 ఏళ్లలో చంద్రబాబు గారిపై ఎన్ని సార్లు దాడులు చేశారు ?
1) చంద్రబాబు గారి నివాసంపై జోగి రమేష్ రాళ్ళ దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చారు.
2) మంగళగిరిలో కేంద్ర కార్యాలయంతో పాటు పదుల సంఖ్యలో మా పార్టీ ఆఫిసులపై దాడులు చేశారు.
3) అమరావతిలో చంద్రబాబు గారి కాన్వాయ్ పై రాళ్ల దాడి… pic.twitter.com/A9QqqiMqcZ— iTDP Official (@iTDP_Official) August 6, 2023