ఈ భూమ్మీద తానంత మంచోడే లేనట్టు
ఎలాగైనా మద్యం నుంచి ప్రజలను కాపాడతానని బీరాలు పలికాడు జగన్ రెడ్డి.
ఆ రోజు మద్యం రేట్లు పెంచి జనాలను తాగుడుకు దూరం చేయడానికి మద్యం రేట్లను పెంచాను అని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు … ఇదిగో వీడియో చూడండి.
మీ బినామీ లిక్కర్ కంపెనీల దోపిడీ కోసం, నాడు మద్యం ధరల పెంపుని సమర్ధిస్తూ, షాక్ కొట్టేందుకే పెంచాం, అందుకే తాగటం తగ్గించారు అని చెప్పిన జగన్ రెడ్డి, నేడు మద్యం ధరలు ఎందుకు తగ్గించావ్ ? తాగి ఊగమని తగ్గించావా ? మరి మద్య నిషేధ హామీ ఏమైంది ? pic.twitter.com/5zof4droZk
— Telugu Desam Party (@JaiTDP) December 19, 2021
ఇపుడు ప్లేటు తిరగేశాడు
రేట్లు తగ్గిస్తున్నాను అన్నాడు.
మరి షాక్ కొట్టే రేట్లతో మద్యం మాన్పిస్తాను అని చెప్పావు కదా… మరి ఏ ఉద్దేశంతో రేట్లు తగ్గించినట్లు ఇపుడు ?
ఆరోజు పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చారే పేపర్లకు. మీడియాకు.
కోట్ల రూపాయలు ఈ యాడ్స్ కి ఖర్చుపెట్టారు.
మళ్లీ మాట మాడమ తిప్పి రేట్లు తగ్గించారు.
మద్యం రేట్లు వైసీపీకి వ్యతిరేకత పెంచుతున్నాయని తెలియడంతో ఇపుడు వెనక్కి తగ్గాడు జగన్ రెడ్డి.
ఉద్యోగుల కంటే మందు బాబుల ఓటింగ్ పెద్దది. అందుకే వారిలో వ్యతిరేకత పోగొట్టాలని నేడు ధరలు తగ్గించాడు.
అయితే, ఇంతకాలం వైసీపీ నేతల సొంత కంపెనీలు, తన బంధువుల కంపెనీలు లాభాల కోసం బ్రాండెడ్ మద్యాన్ని నిషేధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇపుడు పదవే పోయే ప్రమాదం రావడంతో ధరలు తగ్గించాడు జగన్.
మద్యపాన నిషేధం ఎప్పుడు ?
ఎన్నికలకి ఒక రోజు ముందా @ysjagan ? #YsJaganFakeFellow pic.twitter.com/e83vnATNAN— iTDP Official (@iTDP_Official) December 19, 2021