టీడీపీ కురువృద్ధ నాయకుడు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఉపశమనం కలిగింది. సాధారణంగా ఏపీలో ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీని గట్టిగా ఎదుర్కొనేందుకు.. నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్ర మంలో కొందరికి కంటిపై కునుకు లేకుండా పోయింది. ఇది ఎక్కడైనా సాధారణమే. అయితే.. దీనికి భిన్నంగా.. దాదాపు 80 + వయసులో అసలు టికెట్ నుంచి పోటీ వరకు కూడా.. గోరంట్లకు గడబిడ ఏర్పడిం ది. ఏ నిముషానికి ఏం జరుగుతుందో అని ఆయన భిక్కచచ్చిపోయారు.
వరుస విజయాలతో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి దూసుకుపోతున్న వృద్ధ నేతగా.. బాబాయి గోరంట్లకు మంచి పేరే ఉంది. పైగా ఆయనకు సింపతీ కూడా ఎక్కువనే అంటారు. ఈ వయసులోనూ .. ఆ యన యువకుడిగా ఉంటారు. ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడకు రివ్వున వెళ్లిపోతారు. నేనున్నానంటూ.. పలకరిస్తారు. ఇదే.. ఆయనను మరోసారి పోటీకి నిలబెట్టేలా చేసింది. అయితే. టీడీపీ-జనసేన పొత్తుల కారణంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం డోలాయమానంలో పడింది.
వయసు ఆధారంగా గోరంట్లను పక్కన పెడతారనే ప్రచారం తెరమీదికి వచ్చింది తర్వాత.. పొత్తుల కారణం గా పక్కకు తప్పిస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. ఈవార్తలకు.. వివాదాలకు టీడీపీ అధినేత చంద్రబాబు కొన్నాళ్ల కిందటనే చెక్ పెట్టారు. ఆయన పోటీలో ఉంటారు! అని వెల్లడించారు. అయితే.. ఆ పోటీ ఎక్కడా? అనేది స్పష్టం చేయలేదు. దీంతో మరోసారి బాబాయి పరిస్థితి కంటిపై కునుకు లేకుండా పోయింది. అయితే.. తాజాగా జనసేన రూపంలోనే బాబాయికి రిలీఫ్ లభించింది.
ఇప్పటి వరకు తనకు పోటీ అనుకుంటున్న జనసేన నాయకుడు కందుల దుర్గేష్.. తన పోటీ రాజమండ్రి రూరల్ నుంచికాదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను నిడదవోలు నుంచి పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు. ఇది వైసీపీ సిట్టింగు సీటు కావడం గమనార్హం. ఇక్కడ నుంచి పారిశ్రామిక వేత్త జీ. శ్రీనివాసనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. ఈయనను మారుస్తారనే ప్రచారం ఉంది. ఇక, ఇప్పుడు ఎలాంటి జాబితా లేకుండానే దుర్గేష్ తనకు తానే సీటు ప్రకటించు కోవడంతో బుచ్చయ్య కు భరోసా ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు.