అగ్రరాజ్యం అని చెప్పుకొనే అమెరికా.. ప్రపంచ దేశాలకు పాఠాలు బోధిస్తుంటుంది. ఏది మంచో ఏది చెడో కూడా సూక్తులు చెబుతుంది. కానీ, సొంత దేశంలో పేట్రేగుతున్న తుపాకీ సంస్కృతి.. తద్వారా విచ్ఛిన్న మవుతున్న శాంతి భద్రతలు, పెట్టుబడులు, ఆర్థిక రంగాలను మాత్రం సరిదిద్దుకోలేక పోతోంది. తాజాగా ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఓ ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ఈ ఘటన ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది.
అయితే.. అమెరికాలో ఇలా.. అధినాయకులపైనా.. మాజీ అధ్యక్షులు, అధ్యక్షులపైనా దాడులు జరగడం కొత్తేమీ కాదని అంటున్నారు పరిశీలకులు. తొలి అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నుంచి ప్రస్తుత మాజీ అధ్యక్షుడు ట్రంప్ వరకు ఎంతో మంది బాధితులు ఉన్నారని వారు చెబుతున్నారు.
+ 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ గుడ్ ఫ్రైడే రోజు ఏప్రిల్ 14, 1865లో హత్యకు గురయ్యారు. వాషింగ్టన్ D.C.లోని ఫోర్డ్స్ థియేటర్లో రాత్రి 10:15 గంటలకు ఈ హత్య జరిగింది. హంతకుడు, జాన్ విల్కేస్ బూత్, మేరీల్యాండ్‌కు చెందిన ప్రముఖ నటుడు. కాన్ఫెడరేట్ సానుభూతిపరుడు.
+ అమెరికా 20వ ప్రెసిడెంట్ జేమ్స్ ఏ. గార్ఫీల్డ్ హత్యకు గురయ్యారు. ఆయన అధికారం చేపట్టిన నాలుగు నెలల తర్వాత, జూలై 2, 1881 శనివారం ఉదయం 9:20 గంటలకు వాషింగ్టన్ D.C.లోని బాల్టిమోర్ పోటోమాక్ రైల్రోడ్ స్టేషన్లో ఆగంతకుడు కాల్చి చంపాడు.
+ విలియం మెకిన్లీ హత్య సెప్టెంబర్ 6, 1901 శుక్రవారం సాయంత్రం 4:07 గంటలకు న్యూయార్క్‌లోని బఫెలోలోని టెంపుల్ ఆఫ్ మ్యూజిక్‌లో జరిగింది. పాన్-అమెరికన్ ఎక్స్‌పోజిషన్‌కు హాజరైన మెక్కిన్లీని లియోన్ క్జోల్గోస్జ్ రెండుసార్లు కాల్చి చంపాడు.
+ జాన్ ఎఫ్. కెన్నెడీ నవంబర్ 22, 1963 శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు హత్యకు గురయ్యారు. టెక్సాస్‌లోని డల్లాస్‌లో డీలీ ప్లాజాలో అధ్యక్ష మోటర్కేడ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది.
+ మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ ప్రోగ్రెసివ్ పార్టీ సభ్యునిగా 1912 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేశాడు. అక్టోబర్ 14న విస్కాన్సిన్లోని మిల్వాకీలో ప్రచారం చేస్తున్నప్పుడు, న్యూయార్క్‌కు చెందిన జాన్ ష్రాంక్ అనే సెలూన్-కీపర్ ఆయనను హత్య చేశారు. వారంరోజులుగా అతనిని వెంబడిస్తూ రూజ్‌వెల్ట్‌ను ఛాతీపై కాల్చాడు.
+ మార్చి 30, 1981న, రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో నిర్వహించిన సమావేశం ముగించుకుని వస్తున్న సమయంలో హత్యకు గురయ్యారు. హంతకుడు జాన్ హింక్లీ జూనియర్ అతనిపైకి ఆరు సార్లు కాల్పులు జరిపాడు. రీగన్‌తో పాటు మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు.