రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఇటు కూటమి ప్రభుత్వం.. అటు వైసీపీ నుంచి కూడా సూపర్ సిక్స్ పథకాలపై చర్చ సాగుతోంది. ప్రజలు ఏదో అనుకుంటున్నారన్న భావన ప్రభుత్వంలోనూ.. ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్న వాదన ప్రతిపక్ష నేతల్లోనూ కనిపిస్తోంది. ఇదే అసలు వివాదానికి కారణమైంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఏడు మాసాల కాలంలో వైసీపీ ట్రాప్లోకి వెళ్లని కూటమిప్రభుత్వం.. తాజా పరిణామాలతో ఆ పార్టీ ట్రాప్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది.
కానీ, అసలు విషయం మాత్రం వేరేగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో చేసిన తప్పులు చేయకపోవడమే కూటమి సాధించిన గొప్ప విజయంగా వారు అంటున్నారు. లెక్కకు మిక్కిలిగా అప్పులు చేయడం.. వాటిని అభివృద్ధికి కేటాయించకపోవడంతోనే ఫిసికల్ డెఫిసిట్కు దారి తీస్తోందని అంటున్నారు. అంటే.. ద్రవ్య లోటుకు దారులు వేసిందన్న మాట. ఇదే విషయాన్ని ఇటీవల నీతి ఆయోగ్ కూడా చెప్పింది.
ఈ తప్పు చేయడం వల్లే వైసీపీ కారణంగా రాష్ట్రం అథోగతికి వెళ్లిపోయిందన్న వాదన బలంగా వినిపిస్తోం ది. ప్రజల్లోనూ ఈ భావన ఉంది. కాబట్టే గత ఏడాదిఎన్నికల్లో కూటమిపార్టీలకు కనీ వినీ ఎరుగని విజయా న్ని ప్రజలు కట్టబెట్టారు. తద్వారా.. రాష్ట్రం బాగు పడాలన్నదే వారి వాదన అనే విషయాన్ని స్పష్టం చేశా రు. ఈ చిన్న విషయాన్నిఅర్ధం చేసుకున్నప్పటికీ.. వైసీపీ చేస్తున్న ప్రచార వలలో కూటమి ప్రభుత్వం చిక్కుకుంటోంది. నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నా..ఇప్పుడు ఎందుకో తర్జన భర్జన పడుతోంది.
దీని నుంచి బయటకు రావాలన్నది పరిశీలకులు చెబుతున్నమాట. వైసీపీ చేసిన తప్పులు చేయకపోవ డాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. కాబట్టి ఇప్పటికిప్పుడు.. కూటమిసర్కారు బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. అలా కాకుండా.. వైసీపీ ట్రాప్లో చిక్కుకుని లెక్కకు మిక్కిలిగా అప్పులు చేస్తే.. మరింతగా కూటమి సర్కారు ఇబ్బందులు ఎదుర్కొనాల్సిఉంటుందని కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు ఒకింత ఆలోచన చేయాలని చెబుతున్నారు.