మాటలకు అందని విషాదం అని రాస్తుంటారే! అన్ని విషాదాలూ అంటువంటి ఉత్పరివర్తన నుంచి పుట్టుకు వచ్చేవే కదా! కనుక ఏ విషాదం అయినా మాటలను కాదు విచ్ఛిన్న కర మౌనాన్ని భయంకర శాబ్దిక ఆందోళననూ ఇచ్చే వెళ్తాయి.
కనుక లతాజీ లోకాన్ని విడిచిపోయినా, బాలూ లోకాన్ని విడిచిపోయినా అవన్నీ ఉద్విగ్న విషాదాలే కానీ పునరావృతికి నోచుకోని విషాదాలు అయితే మేలు.
లోకం నుంచి వెళ్లిపోయిన వాటితో ఏ తగాదా లేదు కానీ అప్రియం అని ఎందుకు రాశానంటే చావు అప్రియం కదా ఆ వేళ మనల్ని విడిచిపోయిన స్వరం కూడా అప్రియం కావొచ్చు.
లేదా అప్రియ సంబంధ విషాదంలో ఉన్నాం కనుక లతాజీ ఇకపై మనలను ఓలలాడించరు అన్న బాధలోనే ఉండిపోవాలి మనం.
ఆ విధంగా ఉన్నా కూడా మనం మననం చేసుకోదగ్గ దుఃఖాలను మాత్రమే భరిస్తాం..కోపంలోఅప్రియం.. ప్రేమలో కూడా అప్రియం..విషాదంలో కూడా అప్రియం.. మరణం కూడా అప్రియమే!
కనుక అప్రియాతి అప్రియమయిన మరణ వాంగ్మూలాల చెంత లతాజీ చెబుతున్న లేదా వినిపిస్తున్న లేదా విన్నవిస్తున్న వాక్కు ఈ వారాంత విషాదం. లతాజీ మీకు నా నమస్సు.
వారాంతంలో ఏమయినా రాయాలన్నా చేయాలన్న అస్సలు ఆలోచనకు అందనివ్వని విషాదాలే వెన్నాడుతున్నాయి.
చావు దగ్గర భాష,భయం,ఉద్వేగం మరియు ఉద్దేశం ఇంకా ఇంకొన్ని మేలిమి విషయాలే అయి ఉంటాయి. చావు దగ్గర గద్గద స్వరాలే వినిపిస్తాయి.
జీవితాన్ని అంతిమ కాలాల చెంత నిలిపిన క్షణాలన్నీ తిట్టిపోతలకు గురి అవుతాయి. అయినా మనం ఓ కొత్త ఆశను అందుకుని లతను అల్లుకుని లతాజీ గానం వినుకుని ముందుకు పోవడమే సిసలు అర్థం జీవితానికి మరియు సంబంధిత గమనానికి..
స్వరం ఆగిపోయిన చోటు విషాదంఅని పలకడం చాలా చెడ్డగా తోచింది.స్వరం ఆగినచోటు విస్తృతంఅయిన కాలాలు ఉన్నాయి.
వాటితో పోటీ పడి కొత్త రాగాన్వేషణకు కాలం కలిసి వచ్చేలా చేయాలి.
కాలం అయినావిషాదం అయినా ఏవీ కొన్ని పనులను మరియు సంకల్పాలను నిలువరించలేవు కనుక ఇవాళ మన నుంచి వేరు పడిన వారంతా నిశ్శబ్ద మాంత్రికఛాయలో ఉండిపోవచ్చు.
విషాదం అనే మాట లతాజీ విషయంలో రాయాలి..విషాదం అన్న మాట బాలు విషయంలో రాయాలి..విషాదం అన్న మాట వారాంతంలో విసిగిస్తోంది.
కరోనా కారణంగా రెండు స్వర సంగీత ఝరులు నేలను విడిచి వెళ్లిపోయాయి.
ప్రపంచం తమ మాట వినాలి అనుకోలేదు కానీ వింటే బాగుండు అన్న విన్నపం ఒకటి చేసి వెళ్లాయి. నిర్దుష్టత అన్నది సంగీతానికి ముఖ్యం అని చెప్పి వెళ్లాయి.
మహమ్మారి కరోనాను పంపండ్రా ఈ లోకం నుంచి ఇంకొన్ని రోజులు మనుషులు హాయిగా ఉండేందుకు కొన్ని స్వర శక్తులు మనకు సాయం అవుతాయి.
వాటి చెంత జీవితం ఉజ్వలం అవుతుంది.కాలం మహిమాన్వితం అయి ఉంటుంది.లతాజీ వెళ్లి రండి!