కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్పను బీజేపీ అధిష్ఠానం తొలగించబోతోందని.. ఆయన స్థానంలో ఈ నెల 26న కొత్త సీఎంను ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
యెడియూరప్పను ఏపీ గవర్నరుగా నియమిస్తారనీ ప్రచారం జరుగుతోంది.
ఈ ఊహాగానాలను యెడియూరప్ప ఖండిస్తూ వస్తున్నారు.
అయితే, బీజీపీలో రాజకీయ మంటలపై కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి తన నర్మగర్భ ఆరోపణలతో మరింత ఆజ్యం పోశారు.
సీఎం యడియూరప్ప, ఆయన ఇద్దరు కొడుకులు కొందరు అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారుని.. వారితో పాటు ఆరు పెద్ద పెద్ద బ్యాగులను తీసుకెళ్లారని ఆయన అన్నారు.
అయితే, ఆ బ్యాగుల్లో ఏముందో నాకు తెలియదు అంటూ ఆయన నర్మగర్భ ఆరోపణలు చేశారు.
బీజేపీ అధిష్ఠానానికి డబ్బు కట్టలు తీసుకెళ్లి ఇచ్చారన్న అర్థంలో కుమారస్వామి వ్యాఖ్యలు ఉన్నాయి.
ప్రధానిని కలవడానికి వెళ్లిన యడియూరప్ప ఆరుబ్యాగులను ఎందుకు తీసుకెళ్లారు?. త్వరలో అన్ని విషయాలూ బయటపడతాయి అని చెప్పారు కుమారస్వామి.
ప్రధానిని కలిసిన యడియూరప్పకు ఎంత గౌరవ మర్యాదలు లభించాయో చూడాలన్నారు.
అక్రమ గనులపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని, అందుకు తన మద్దతు ఉంటుందని అన్నారు.