విమర్శను ఒప్పుకోలేదు.. వైసీపీ.. అదేవిధంగా ఇంకొందరు కానీ కేటీఆర్ చెప్పిన మాట నిజమే అన్నది ఇప్పటికీ రగులుతున్న వివాదం. ఈ వివాదానికి కొనసాగింపు ఇస్తూనే అనంత దారుల్లో ఆయనకు మద్దతు వస్తోంది. మాటలకు కట్టుబడి ఉండు కేటీఆర్ ఎందుకు మాట మార్చడం ఉన్నదేగా చెప్పావు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తాడిపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ మరో విషయమై కూడా క్లారిఫికేషన్ ఇస్తూ తాను పార్టీ మారేదే లేదని తేల్చేశారు. ఆ వివరం ఈ కథనంలో..
ఆంధ్రాలో ఏముందని అన్న కోపం కొందరికి ఉంది. ఆంధ్రాలో అభివృద్ధి సరిగా లేదని కూడా కొందరి మనసులో ఆగ్రహం దాగి ఉంది. అదే ఆగ్రహమో ఆవేశమో కుర్రాడయిన కేటీఆర్ కు కూడా కలగవచ్చు. అయ్యో ! తోటి తెలుగు రాష్ట్రం ఈ విధంగా ఉందా అని ! ఇదే మాట జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. పూర్తిగా ఆయన స్వరానికి మద్దతు ఇస్తున్నారు.
విపక్షం విమర్శిస్తే వైసీపీ తట్టుకోదు సరిగా వినదు వినిపించుకోదు కానీ బూతుల దండకం అందుకుంటుంది అని టీడీపీ అంటోంది. అదే మాట జేసీ కూడా అంటున్నారు. కేటీఆర్ చెప్పింది అక్షర సత్యం. ఆంధ్ర ప్రదేశ్ రూపు అధ్వానంగా ఉంది అని అంటూ ఆవేదన చెందారాయన. కేటీఆర్ మాటలు, తదనంతరం నోచుకున్న పరిణామాలు వీటిపై ఇప్పటికే గొంతు వినిపించిన వైసీపీ ఇప్పుడు జేసీకి ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో మరి !
భాగ్య నగరి దారుల్లో కల్వకుంట్ల తారక రామారావుకు, అనంత వీధుల్లో జేసీ కుటుంబానికి ఏంటి బంధం. ఆశ్చర్యపోకండి. రాజకీయం అంటే సవాలక్ష బంధానుబంధాల కూడిక. ఆ కూడలి చెంత కవితక్క మరియు షర్మిలక్క ఉంటారు. ఆ కూడలి చెంత వెలమ దొర అయిన కేటీఆర్ అదేవిధంగా సీమ పెద్ద అయిన జేసీ దివాకర్ మరియు ప్రభాకర్ అనే రెడ్డి సామాజికవర్గ ప్రతినిధులూ ఉంటారు. కనుక కేటీఆర్ కు ఇప్పుడు పెద్ద అభిమానిగా మారిపోయారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
తమ్ముడూ నీవు ఏమన్నావో దానికి కట్టుబడి ఉండు. ఏం కాదు నోరు జారానని అనకు. నీలో ఆవేశం ఉంది. మాట మార్చావు అంటే భయపడి కాదు బాగుండదని చెప్పుకొచ్చారు జేసీ అనే ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. ఇంతకూ ఈ ప్రేమ ఎందుకని ? జగన్ ప్రభుత్వం తీరు బాగుండకే రోడ్లు కనీస మరమ్మతులు నోచుకోవడం లేదు అన్నది వాస్తవమే ! అదేవిధంగా రోడ్లు బాగుండకపోవడం వలనే ఖరీదయిన వాహనాల్లో జేసీ తిరగలేకపోతున్నానని చెప్పడం వాస్తవమే ! కనుక నోరు జారానని చెప్పుకోవడం సబబు కాదు అన్నది ఆయన అభిప్రాయం. ఉన్నమాటే అన్నారు కదా ! ఇక ఉలికి పాటు ఎందుకు అన్నది ఆయన స్పష్టమయిన అభిప్రాయం ఒకటి చెబుతూ, వెల్లడిస్తూ వస్తున్నారు.