రాజకీయం అన్నాక ఎన్నో అనాలి మరియు వినాలి. ఆ విధంగా మంచి మార్పులు వస్తే సంతోషించాలి కూడా ! కానీ తెలివిగా టీఆర్ఎస్ మాత్రం బీజేపీకి డైలాగులు రాసి ఇస్తోంది. రెండ్రోజుల సమావేశాల నిమిత్తం ఇక్కడ బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీ కావడంతో ఇదే అదునుగా పొలిటికల్ పాఠాలు చెబుతాం వినండి అంటూ సామాజిక, ఆర్థిక ప్రగతి అన్నది తెలంగాణను చూసి నేర్చుకోవాలి అని, దేశాన్ని ముందుకు నడిపే ప్రధాని మోడీ తెలంగాణ అభివృద్ధి నమూనాను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అంటూ కేటీఆర్ లెక్చర్ ఇస్తూ వస్తున్నారు.
ఆవో – దేఖో – సీఖో అని కేటీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్, ప్రధాని మోడీకి పాఠాలు చెప్పేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఆరు పేజీల నోట్సును దేశ ప్రధానిని ఉద్దేశించి రాసి, సోషల్ మీడియాలో విడుదల చేసింది. జాతీయ సమావేశాల్లో విభజన అజెండా కాకుండా అభివృద్ధి – వికాసం గురించి మాట్లాడండి అంటూ కేటీఆర్ తన మొదటి ప్రస్తావనాంశంగా ఉంచారు.
మీ సమావేశాల ప్రధా న అజెండా విద్వేషం అని అందరికీ తెలుసు, అయినా మీ నుంచి మంచి ఆశించడం అత్యాశే అవుతుంది అని కూడా అంటున్నారాయన. అభివృద్ధి విషయమై మీ పార్టీ నూతన ప్రారంభం చేసేందుకు తెలంగాణను మించిన ప్రాంతం మరొకటి లేదు అని కూడా విన్నవిస్తున్నాను అని అంటున్నారాయన.
తెలంగాణ ప్రాజెక్టులు – పథకాలు ఒక్కసారి అధ్యయనం చేసి వెళ్లండి.. బీజేపీ పాలిత ప్రాంతాలలో వాటిని అమలు చేయండి..అని సూచిస్తున్నారు. డబుల్ ఇంజిన్ మోడల్ తో ప్రజలకు ట్రబుల్ గా మారిన మీరు మా ప్రాంత పాలన వ్యవస్థలో ఉన్న మంచిని మీ..పాలిత రాష్ట్రాలలో అమలు చేయడం అని అంటున్నారు.
ఇంకా చాలా చెప్పారు. అయితే వీటిని బీజేపీ పట్టించుకుంటుందా లేదా అటుంచితే ఓ పార్టీ జాతీయ సమావేశాల్లో ఏం మాట్లాడాలో కూడా ప్రధాని స్థాయి వ్యక్తికి కేటీఆర్ ఉపదేశాలు ఇవ్వడమే ఈ కథలో అతి పెద్ద ట్విస్టు.