పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ అంటే ఎంత హంగామా ఉంటుంది! భారీ కటౌట్లు.. వందలు, వేలల్లో జనాలు.. బోలెడంతమంది గెస్టులు.. మామూలుగా ఉంటుందా! ఉండదు. కానీ ఈసారి మాత్రం మామూలుగానే ఉండాలి అనుకున్నారు పవన్ కళ్యాణ్. ప్యాండమిక్ సిట్యుయేషన్ పూర్తిగా చక్కబడకపోవడం వల్ల ఈ నెల 21న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని చాలా సింపుల్‌గా చేయాలనుకున్నారు.
ఎప్పుటిలా హంగామా చేయకుండా.. వీలైనంత తక్కువమందితో ఈవెంట్‌ని లాంగిచేయాలనేది ప్లాన్. అందుకే గెస్టులు కూడా ఎవరూ లేరన్నారు. దాంతో ఏ చిరంజీవియో రామ్ చరణో ప్రభాసో వస్తారనుకున్న అభిమానుల ఆశలు ఆడియాశలే అయ్యాయి. అయితే చివరి నిమిషంలో ఎవరూ ఊహించని గెస్టుని ఫిక్స్ చేసింది భీమ్లానాయక్ టీమ్. ఆయన ఎవరో కాదు.. కేటీఆర్. అవును. ఎల్లుండి జరగబోయే ఈవెంట్‌కి ఆయనే చీఫ్ గెస్ట్.
యూత్‌లో కేటీఆర్‌కి ఉన్న క్రేజ్ తక్కువేమీ కాదు. ఆయన మాట్లాడే ప్రతి మాటనీ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి పీకే ఫ్యాన్స్ హ్యాపీ. కాకపోతే ఆయన్ని పిలవడంలో పొలిటికల్ స్ట్రాటజీ ఏదైనా ఉందా అని కూపీ లాగుతున్నవాళ్లు కూడా కొందరు ఉన్నారు. ఓ పార్టీ చీఫ్ ఈవెంట్‌కి రూలింగ్ పార్టీ మినిస్టర్, అందులోనూ స్వయానా ముఖ్యమంత్రి కొడుకు రావడం సినిమా విషయంలోనే కాదు, రాజకీయపరంగానూ కలిసొచ్చే అంశం కాబట్టే సింపుల్‌గా చేద్దామనుకున్న ఈవెంట్‌కి ఈ రేంజ్ గెస్ట్‌ని సెట్ చేసి ఉండొచ్చనేది వాళ్ల అంచనా.
అయితే, కేటీఆర్ ని గెస్టుగా పిలవడం వెనుక ఇంకో మతలబు కూడా ఉంది. వైసీపీ సర్కారుకు పవన్ కు ప్రచ్చన్న యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను గెస్టుగా పిలవడం ద్వారా వైసీపీకి ఒక మెసేజ్ ను ఇవ్వాలనుకున్నారు పవన్. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట. టీఆర్ఎస్ కు వైసీపీకి మధ్య మాంచి స్నేహం నడుస్తుండగా… పవన్ పిలుపును అందుకు భావి తెలంగాణ సీఎం పవన్ ఫంక్షన్ కు రావడం ఆశ్చర్యకరమే. పవన్ దెబ్బకు వైసీపీకి షాక్ తగిలే ఉంటుంది.