కుట్రతో మళ్ళీ ముంచేసారు. ఒక పక్క శ్రీశైలం నుంచి భారీ వరద వస్తుంది, మరో పక్క వాయిగుండంతో భారీ వర్షాలు పడుతున్నాయి. అయినా ప్రకాశం బ్యారేజి దగ్గర నీళ్ళు నిలవ పెట్టారు. కొండవీటి వాగు ఎత్తిపోతల ఎందుకు ఆన్ చేయలేదు. ? మమ్మల్ని ముంచి, ఆనంద పడటానికి కదా ? ఇంత వరద వస్తుంటే, కొండవీటి వాగు ఎత్తిపోతల ఎందుకు మొదలు పెట్టలేదు ?
కొండవీటి వాగు ఎత్తిపోతల ఎందుకని, ఇప్పటికీ ఆన్ చేయలేదు. ఎంత వర్షం పడుతుంది, ఎంత వరద వస్తుందో తెలియదా ? అధికారులు మీకు చెప్పటం లేదా ? మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, వాయిగుండం అని చెప్తున్నారు. కొండవీటి వాగు ఎత్తిపోతలలో, 16 పంపులు, 16 మోటార్లతో, 5 వేల క్యూసెక్కుల వరదను ఎత్తి పోయవచ్చు. మూడు రోజుల ముందే అంచనా వేసి, కొండవీటి వాగు ఎత్తిపోతల మొదలు పెట్టి ఉంటే, చుక్క నీరు కూడా మాకు వచ్చేది కాదు. ఇది ముమ్మాటికీ కుట్రే…
రాజధాని గ్రామాలను ఎందుకు ఇలా కావాలని ఇబ్బంది పెడతారు ? 250 కోట్లతో నిర్మించిన కొండవీటి వాగు ఎత్తిపోతల ఎందుకు వాడుకోవటం లేదు ? ఇది వాడుకుంటే, ఒకేసారి 5 వేల క్యూసెక్కుల నీరు ఎత్తి పోయవచ్చు. వర్షాలు పడుతున్నాయని తెలియదా ? వరద వస్తుందని తెలియదా ? అధికారులు నిద్ర పోతున్నారా ? లేక మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదు అనుకుంటున్నారా ? 20 రోజుల క్రితం కొండవీటి వాగు ఎత్తిపోతల ఆన్ చేయగానే, అది ఎంత ఉపయోగమే రాష్ట్రం మొత్తం తెలిసింది. ఇది ఫంక్షనింగ్ లో ఉంటే, అమరావతికి వరద రాదు అని అర్ధం అయింది. అందుకే రెండో రోజే దాన్ని ఆపేశారు. నిన్న, ఈ రోజు ఇంత వరద వస్తున్నా, అసలు పట్టించుకోవటం లేదు.
కొండవీటి వాగుకి, కృష్ణ నదికి ఒకే సారి వరద వచ్చి, కొండవీటి వాగు వెనక్కు తన్ని, కొంత మేర పొలాల్లోకి నీరు వెళ్తుంది. 20 రోజుల క్రితం ఇలాగే జరిగితే, వెంటనే అధికారాలు కొండవీటి వాగు ఎత్తిపోతల ఆన్ చేసారు. 5 మోటార్లు మాత్రమే ఆన్ చేసినా, వరద తగ్గిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు కొండవీటి వాగు ఎత్తిపోతల మొదలు పెట్టలేదు ? ఎందుకని అంచనా వేయలేక పోయారు ? ఇప్పటికీ ఎందుకు కొండవీటి వాగు ఎత్తిపోతల ఆన్ చేయలేదు. ఇది కుట్ర కాక మరేంటి ?