ఏపీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని కోమసీమ జిల్లా ఉద్యమకారులు తగలబెట్టారు. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అంబేడ్కర్ పేరు జిల్లాకు పెడితే వ్యతిరేకించడం బాధాకరమని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు.
జిల్లా ప్రజల అభీష్టం మేరకే జిల్లా పేరు మార్చడం జరిగిందని తెలిపారు. ప్రజాభీష్టం మేరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చినట్లు పేర్కొన్నారు. సంఘ విద్రోహ శక్తులు అల్లర్లు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
20 మంది పోలీసులపై రాళ్లతో దాడి చేసి గాయపరిచారని అన్నారు. ప్రైవేటు పాఠశాల బస్సును కూడా తగులబెట్టారన్నారు. పోలీసు జీపుపై కూడా రాళ్ల దాడి చేశారని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడిని హోంమంత్రి ఖండించారు.
కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేసాయన్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఈ మధ్యనే పేరు మార్చేందుకు ప్రబుత్వం సిద్ధమైందని మంత్రి తెలిపారు.
డా.బీఆర్ అంబేద్కర్ మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న,, ఆయన ఎంతో మందికి స్ఫూర్తి దాయకమని అన్నారు. అలాంటి మహానుభావుని పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ కోనసీమ గా పేరు మార్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని మంత్రి సూచించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని మంత్రి తానేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవలు చేసే వారి వెనుక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
20 మందికి పైగా పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచారని, స్కూల్ బస్సుల ను కూడా తగులబెట్టారని మంత్రి తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తప్పక చర్యలు ఉంటాయన్నారు. ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను అదేశిస్తున్నానని మంత్రి తెలిపారు.