రూ.2.5 కోట్లు పెట్టి ప్రముఖ క్రికెటర్ విరాట్ కొహ్లీ, అనుష్క దంపతులు కొన్న షేర్లు ఒక్క రోజు తిరిగే సరికి రూ.10 కోట్లు అయ్యాయి. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాగానే దూసుకుపోయింది. ఈ కంపెనీ షేర్ల ధరలు ఏకంగా రూ.300 దాటిపోయాయి. ఈ కంపెనీకి విరాట్ కొహ్లీ బ్రాండ్ అంబాసిడర్ కావడం విశేషం.
గో డిజిట్ కంపెనీ షేర్లను కోహ్లీ ఒక్కోటి రూ. 75 చొప్పున రూ.2 కోట్లు వెచ్చించి మొత్తం 2,66,667 షేర్లు కొనుగోలు చేశాడు. విరాట్ సతీమణి అనుష్క రూ.50 లక్షలతో 66,667 షేర్లు కొనుగోలు చేసింది. విరాట్ రూ.2 కోట్ల పెట్టుబడి అమాంతం రూ.8 కోట్లకు, అనుష్క రూ.50 లక్షల పెట్టుబడి అమాంతం 2 కోట్లకు పెరిగింది.
ఐపీవోలో భాగంగా గోడిజిట్ రూ. 1,125 కోట్ల కొత్త షేర్లను, రూ. 1,490 కోట్ల షేర్లను ఆఫర్ సేల్ కింద ఐపీవోలో భాగంగా విక్రయించింది. లిస్టింగ్ సమయంలో ఒక్కో షేరు రూ. 306 వద్ద ట్రేడ్ కావడంతో కంపెనీ సంపద 4 రెట్లు పెరిగింది. ఐపీఓ ద్వారా రూ.1500 కోట్లు సమీకరించాలని ీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.