విశాఖలోని విమానాశ్రయంలో 2018లో జరిగిన కోడికత్తి కేసు కు సంబంధించి వైసీపీ అడ్డంగా బుక్కయిందనే వాదన వినిపిస్తోంది. ఈకేసులో అప్పటి అధికార పార్టీ టీడీపీ భాగస్వామ్యం ఉందంటూ పెద్ద ఎత్తున జగన్ పార్టీ నేతలు.. విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. జగన్‌ను చంపేయాలనే కుట్ర చేశారని కూడా అన్నారు. తద్వారా అప్పటి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశారని అప్పట్లోనే టీడీపీ విమర్శలు గుప్పించింది. అయితే.. ఇన్నేళ్ల తర్వాత.. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ.. ఈ కేసులో కుట్ర కోణం లేదని కుండబద్దలు కొట్టింది.
ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ ప్రసాద్‌కు ఈ సంఘటనతో ఏ సంబంధం లేదని వెల్లడించింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని తేలిందని పేర్కొంది. నిజానికి ఈ విషయాన్ని ఘటన జరిగినప్పుడే శ్రీనివాసరావు తేల్చి చెప్పారు. తాను వైసీపీ సానుబూతిప రుడినని, జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇక, కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇక దర్యాప్తు అవసరం లేదని ఎన్ ఐఏ తెలిపింది.
కోడికత్తి దాడిలో కుట్రకోణం ఉందని లోతైన దర్యాప్తు జరపాలని ఈ నెల 10వ తేదీన జగన్ తరపు న్యాయవాదులు పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని ఎన్ఐఏ కోరింది. అయితే వాదనలకు రెండు రోజుల సమయం కావాలని జగన్ తరపు లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోర్టుకు కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. మరోవైపు.. నిందితుడు తరపున న్యాయవాది అబ్దుస్ సలీం కౌంటర్ దాఖలు చేశారు.
గత వాయిదాలో ఈ కేసును కుట్ర కోణంలో విచారించేలా ఆదేశించాలని కోరుతూ సీఎం జగన్ పిటిషన్‌పై సలీం కౌంటర్ దాఖలు చేశారు. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ పీపీ విశాల్ గౌతమ్ కూడా కౌంటర్ దాఖలు చేశారు. రెండు కౌంటర్లలో ప్రత్యక్ష సాక్షి, బాధితుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇంకా లోతుగా విచారణ చెయ్యాలని వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కౌంటర్లు వేశారు. ఇదిలావుంటే.. ఇప్పటి వరకు టీడీపీపైనా.. శ్రీనివాసరావుపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ అదినేత జగన్ ఇప్పుడు ఏం చెబుతారనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ డిమాండ్ చేయడం గమనార్హం.
— Sasidhar✌???????? (@sasidharv1) April 13, 2023
కోడి కత్తి డ్రామాను అప్పట్లో రక్తికట్టించిన జగన్… ఆ ఘటనలో కుట్ర కోణం ఉందన్నాడు. కోడికత్తి శీను టీడీపీ మనిషి అన్నాడు. శీను పనిచేసే రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ టీడీపీ ప్రోద్భలంతో చేయించాడని అన్నాడు. ఇప్పుడు అవన్నీ కట్టు కథలు అని ఎన్ఐఏ తేల్చి చెప్పేసింది. ఇప్పుడేమంటావ్ జగన్? pic.twitter.com/dRdvSQxiJn
— Telugu Desam Party (@JaiTDP) April 13, 2023