విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఎంత సంచలనం అయ్యిందో తెలిసిందే. న కేంద్ర ప్రభుత్వ తీరుపై ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో నిరవధికంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. కేంద్రం మాత్రం జగన్ కి చెప్పి, జగన్ తో మాట్లాడిన తర్వాతే ఆయన ఎదురుగానే ఒప్పందాలు చేసుకున్నాం అని చెబుతోంది. ఒడిసా పోస్కోను అడ్డుకోలిగినపుడు ఏపీ అడ్డుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ జగనే అసలు సూత్రధారి అని కేంద్రం, ప్రతిపక్షాలు చెబుతున్న నేపథ్యంలో అంతా ఆశ్చర్యపోయారు.
తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటానికి పలు రాజకీయ పార్టీల నేతలు మద్దతు ఇచ్చారు. TRS పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. రోజురోజుకి ఉద్యమం పెద్దది అవుతోంది.
ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. మరి ఆయన పర్సనల్ ఒపీనియనా?.. అధికారికంగా చెప్పారా అన్నది అర్థం కావడం లేదు. ఢిల్లీలో మాట్లాడుతూ చెప్పారు కాబట్టి అధికారిక నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది.
విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. నష్టాల్లో కొనసాగుతోన్న విశాఖ ఉక్కు పరిశ్రమను నడపడం భారం కాబట్టి అమ్ముతున్నాం అని చెప్పుకొచ్చారు. అయితే…. ఏపీ ప్రభుత్వం కనుక దానిని కొనాలి అనుకుంటే కేంద్రం ఆలోచిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఉక్కు పరిశ్రమల కోసం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పారు.
మరి కిషన్ రెడ్డి అంటే జరుగుతుందా? జగన్ ప్రైవేటుగా తన వాళ్లతో కొనుక్కుంటాడా? లేక ఏపీ సర్కారు తరఫున కొంటాడా? ఇది చిక్కుముడే.