మహానటి కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలెక్కనుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానే వచ్చింది. తాజాగా కీర్తి సురేష్ తనకు కాబోయే భర్త ఆంటోనీని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. ఇటీవల దీపావళి సందర్భంగా ఆంటోనీతో కలిసి దిగిన ఫొటోను అందరితో పంచుకుంది. తమ 15 ఏళ్ల ప్రేమ బంధం పెళ్లితో జీవితాంతం కొనసాగుతుందని కీర్తి సురేష్ వెల్లడించింది.
కీర్తి సురేష్ పోస్ట్ వైరల్ గా మారడంతో.. సినీ తారలు, అభిమానులు కాబోయే కపుల్ కు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. ఇకపోతే ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే కీర్తి సురేష్, ఆంటోనీ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కీర్తి సురేష్ సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగితే.. ఆంటోనీ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖతార్ లో కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. ఆపై స్వదేశానికి వచ్చి కొచ్చిలో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు.
పదిహేనేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఆంటోనీ, కీర్తి.. ఇప్పుడు పెద్దల అంగీకారంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. డిసెంబర్ 11న గోవాలోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆంటోనీ, కీర్తి సురేష్ పెళ్లి వేడుక జరగబోతోందని అంటున్నారు. కాగా, ప్రముఖ మలయాళ హీరోయిన్ మేనక, నిర్మాత సురేష్ కుమార్తె అయిన కీర్తి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆపై హీరోయిన్ గా మారి అనతి కాలంలోనే సౌత్ లో భారీ స్టార్డమ్ సంపాదించుకుంది. త్వరలో బేబీ జాన్ మూవీతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది.
15 years and counting ♾️🧿
It has always been..
AntoNY x KEerthy ( Iykyk) 😁❤️ pic.twitter.com/eFDFUU4APz— Keerthy Suresh (@KeerthyOfficial) November 27, 2024