“విద్యుత్ సంస్కరణల ముసుగులో మీటర్లు పెడుతున్నారు. మీటర్ పెడతామన్న వారికే మీటర్ పెట్టాలి“ అని మునుగోడు ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
చుండూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. “ఎన్నికల్లో చేసే దుర్మార్గమైన ప్రలోభాలకు ఆశపడితే గోస పడతాం. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే పాలు రావు. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధం మరొకరిని చేయమనడం సరికాదు. పాలను, నీళ్లను వేరు చేసి చూసే విజ్ఞత ప్రజలకు ఉండాలి.
మోడీ విశ్వ గురువు కాదు. విష గురువు. బలవంతంగా రుద్దబడిన ఉప ఎన్నిక వారికి చెంపపెట్టు కావాలి’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందకోట్లకు ఆత్మగౌరవాన్ని కొందామని చూసినట్లు తెలిపారు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్లు నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారని ప్రస్తావించారు.
అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా ఎమ్మెల్యేలు జాతి గౌరవాన్ని కాపాడారని ప్రశంసించారు. రాజకీయం అంటే అమ్ముడుపోడం కాదని తమ ఎమ్మెల్యేలు నిరూపించారని పేర్కొన్నారు.
20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్ను పడగొట్టాలని చూశారని అన్నారు. ఆర్ఎస్ఎస్ ముసుగులో వచ్చినవారు చంచల్గూడ జైలులో ఉన్నారన్నారని ఎద్దేవా చేశారు. మునుగోడులో అవసరం లేకుండా ఉప ఎన్నిక వచ్చిందన్నారు.
ఫలితం కూడా ప్రజలు ఎప్పుడో తేల్చేశారని పేర్కొన్నారు. బావ చెప్పిండనో, బావమర్ధి చెప్పిండనో, డ్యాన్సులు చేశారనో ఓట్లు వేయొద్దని కోరారు. దోపిడి దారులు మాయ మాటలు చెబుతూనే ఉంటారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ పచ్చబడితే కొందరు ఓర్వలేకపోతున్నారని కేసీఆర్ విమర్శించారు. దేశంలో అరాచక పాలన అంతానికే బీఆర్ఎస్ పుట్టిందని కేసీఆర్ అన్నారు. రేపటి బీఆర్ఎస్ విజయానికి మునుగోడు పునాది కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
కృష్ణా జలాల్లో మన వాటా తేల్చేందుకు మోడీకి 8ఏళ్లు సరిపోలేదా? అని ప్రశ్నించారు. మునుగోడులో ప్రతి ఎకరానికి నీళ్లందించే బాధ్యత తనదని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే 15 రోజుల్లో మునుగోడు ప్రజల కోరికలు తీరుస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
“अभी आपने जो ऑडियो क्लिप देखा वह बहुत छोटी झलक है। हमारे पास अभी बहुत कुछ है जिसके सामने आने से दिल्ली में भूकंप आ जाएगा। थोड़ा इंतज़ार करें”
-तेलेंगाना के मुख्यमंत्री KCR रैली में pic.twitter.com/eiAxvjdWYN
— Narendra Nath Mishra (@iamnarendranath) October 30, 2022