కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఏపీకి లింక్ ఉందా? అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇది చాలా చిత్రంగా ఉంది. కర్ణాటకలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. కర్ణాటకలో ఏ పార్టీకి కూడా మెజారిటీ పూర్తిగా రాలేదు. అయితే ఇప్పుడు దానికి ఏపీ ప్రభుత్వానికి లింకు ఉందని, ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని పలువురు మేధావులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలించినట్లయితే కర్ణాటకలో కాంగ్రెస్ కానీ బీజేపీ కాని పూర్తిస్థాయిలో మెజారిటీ తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు.
మూడో పార్టీగా ఉన్నటువంటి జెడిఎస్ అక్కడ కింగ్ మేకర్ అవుతుందనేది అందరూ చెబుతున్నటువంటి మాట. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. జెడిఎస్‌కు తక్కువ సీట్లు రావడం, మిగిలిన పార్టీలో ఏదో ఒకదానికి ఆ పార్టీ మద్దతు ఇవ్వడం ఫలితంగా అధికారంలోకి రావడం అందరికీ తెలిసిన విషయమే. ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు టిడిపి అదే విధంగా వైసిపి. ఈ రెండు పార్టీలు కూడా ఒంటరిగా కనుక పోటీ చేసినట్లయితే అక్కడ వచ్చినటువంటి ఫలితమే వస్తుందనేది మేధావులు మాట.
ప్రస్తుతం ఏపీలో పొత్తుల విషయంలో ఇప్పుడు వరకు ఎటువంటి క్లారిటీ లేదు. పొత్తుల విషయాన్ని తేల్చుకుందాం అనేటటువంటి విషయంలో ఎందుకో సంశయాత్మకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దేశంలో బిజెపి అధికార పార్టీకి అండగా ఉందని ఎన్నికల సమయంలో ఈ రక్షణ వ్యవస్థ తమకు వ్యతిరేకంగా పనిచేస్తే ఇబ్బంది పడతామనేటటువంటి అభిప్రాయం టిడిపిలో కనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
2019 ఎన్నికల్లో పరిశీలిస్తే బిజెపి అన్యాపగా వైసిపికి మద్దతుగా పనిచేసింది. దానివల్ల ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నా కూడా చూసి చూడనట్టు వ్యవహరించింది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతుగా బిజెపి ఉంటే గెలుస్తామనేటటువంటి అభిప్రాయం టిడిపికి ఉంది. అయితే.. ఇలా పొడిగించుకుంటూ పోవడం వల్ల పొత్తుల విషయం తేలడం లేదు. దీంతో ఎన్నికల సమయానికి పొత్తులు విషయం ప్రకటించిన కూడా ప్రజల్లో గనక నిర్లిప్త కనుక ఏర్పడినట్లు అయితే ఈ కర్ణాటకలో వస్తున్నటువంటి ఫలితమే ఇక్కడ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని మెజారిటీ అభిప్రాయంగా కనిపిస్తోంది.
వైసీపీ నుంచి సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి వారు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు రానటువంటి వారు మాత్రమే వైసిపికి వ్యతిరేకంగా ఉన్నారు. యువత, నిరుద్యోగులు లేక మధ్యతరగతి వ్యక్తులు మాత్రం కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మీరు తటస్థ ఓటు బ్యాంకు మారే పరిస్థితి ఎక్కువగా ఉంది. అంటే వీరు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తారు అనేటటువంటి పరిస్థితి పెద్దగా ఆశించలేం.
కర్ణాటకలో కూడా తాజాగా ఇదే జరిగింది. అక్కడ 70% పోలింగ్ నమోదు అయితే యువత కన్నా గ్రామీణ స్థాయిలో ఎక్కువ ఓటు బ్యాంకు నమోదు అయింది. ఇదే పరిస్థితి ఏపీలోనూ కనిపించేటటువంటి అవకాశం ఉందని మేధావులు ఒక అంచనాకి వస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో కూడా కర్ణాటకలో వచ్చినట్టుగా ఒక తటస్థమైనటువంటి వైఖరి తీసుకుని ప్రజలు ఏ రెండు పార్టీలకి కూడా అధికారం పూర్తిస్థాయిలో అప్పగించేటటువంటి అవకాశం లేదు అని, ఇక్కడ కూడా హంగు వచ్చేటటువంటి అవకాశం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.