బావా కాకాని నువ్వు చేశావని నేను అనడం లే ????
ఆ నకిలీ పాత్రల కేసులో కాకాని గాడి పాత్ర ఏంటో క్లియర్ గా డిక్లేర్ చేశాడు కోటంరెడ్డి ???? pic.twitter.com/K3CKLIgloJ
— ???????????????????????????????????????????? ???????????????????????????????? ???????????????????? (@ncbn_for_future) February 4, 2023
వైసీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించ డం లేదు. పార్టీ మారిపోతున్నట్టు ఆయన ప్రకటించడం.. ఫోన్లు ట్యాపింగ్ ఆరోపణలు వంటివి ఇంకా మం టలు రేపుతూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాకే చెందిన వైసీపీ సీనియర్ నేత, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. కోటంరెడ్డిపై విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు.. రికార్డింగుకు తేడా లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబును ఫలానా తారీకున కలిసింది నిజం కాదా? అన్నారు.
ఈ క్రమంలో తాజాగా కాకాణిపై కోటంరెడ్డి కూడా విరుచుకుపడ్డారు. “బావా.. కాకాణి చివరకునువ్వు కూడానా?“ అని ఎద్దేవాచేశారు. వైఎస్ ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత కాకాణికి లేదన్నారు. కోటంరెడ్డి వీర విధేయుడేమీ కాదని గోవర్ధన్‌రెడ్డి అన్నారని.. ఇది తప్పని.. ఆయన తెలుసుకోవాలని సూచించారు. అదేసమయంలో ఆనం రామనారాయణరెడ్డిని కాకాణి ఎంత క్షోభ పెట్టారో జిల్లా అంతటికీ తెలుసన్నారు. “పార్టీ నుంచి మౌనంగా వెళ్లిపోదామనుకున్నా. కానీ, అలా వెళ్లనివ్వడం లేదు“ అని వ్యాఖ్యానించారు.
కాకాణికి ఆనం రాజకీయ జీవితం ఇచ్చారని.. అలాంటి నేతపైనా విమర్శలు చేయడం సరికాదన్నారు. ‘బావా కాకాణి.. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. వైసీపీలో ఉండకూడదని నిర్ణయించుకున్నాకే.. టీడీపీ వైపు మళ్లాను. బావా కాకాణి.. నెల్లూరు కోర్టు చోరీ కేసులో అన్ని వేళ్లూ నీ వైపే చూపిస్తున్నాయి. ముందు ఆ కేసు సంగతి చూడు. నాపై కేసులు పెడతామని లీకులు ఇస్తున్నారు. కేసులతో భయపడతానని అనుకోవడం మీ అమాయకత్వం“ అని కోటంరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.
‘‘ఏ పాము లేవకుంటే, ఏలిక పాము లేచినట్లు… మా ప్రియ బావ, మంత్రి కాకాణి కూడా ఆరోపణలు చేస్తున్నాడు. బావా నిన్ను ఆనం జడ్పీ ఛైర్మన్ చేస్తే, నువ్వు విభేధించి ఉండకూడదు కదా? వైఎస్ కుటుంబం నుంచి గొప్పగా మాట్లాడే హక్కు నీకు ఎక్కడికి ఉంది. జగన్ ఓదార్పు యాత్ర సమయంలో ఎన్నిసార్లు నీతో కూర్చొన్నాం. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటాది, జగన్ ఓ నీటిబొట్టు అన్నది వాస్తవమా? కాదా?“ అని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు కాళ్లకి కాకాణి దణ్నం పెట్టిన విషయం మరిచిపోయారని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు.
కోటంరెడ్డి శ్రీధర్ అన్నతోనే మా ప్రయాణం- నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి
ఇప్పుడు ఏమి అంటావ్ బెట్టింగ్ బంగార్రాజు అనిల్? pic.twitter.com/FQiKU3VmCD— మన ప్రకాశం (@mana_Prakasam) February 4, 2023