అందాల రాసి పెళ్లయిపోతోంది. ఇటీవలి కాలంలో టో య్ టు హెడ్ ఫర్ ఫెక్షన్ ఉన్న హీరోయిన్ గా అందరి మనసులు దోచిన ఈ సుందరి సుదీర్ఘ కాలం తెలుగు చిత్రసీమను ఏలింది.
లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి మగధీరతో ఆమె స్టార్ గా ఎదిగింది. హీరోయిన్లకు పెళ్లయిందంటే వాళ్ల కెరీర్ ముందుకు సాగడం కష్టమే. ఒకవేళ సినిమాలు చేసినా.. ముందులా లీడ్ రోల్స్ చేయడం, గ్లామరస్‌గా కనిపించడం.. పెద్ద చిత్రాల్లో అవకాశాలు దక్కించుకోవడం కష్టమే.
ఆమె పెళ్లి గురించి ఆమె ప్రకటించకముందే సమాచారం బయటకు వచ్చేసింది. దానికి దగ్గట్టే అవునబ్బా నాకు పెళ్లి కుదిరింది అని చెప్పేసింది కాజల్. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడబోతున్నట్లు కాజల్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 30న ఆమె పెళ్లి జరగబోతోంది.
ఆమె పెళ్లి ఆమె ఇష్టమే గానీ కాజల్ సినీ కెరీర్ పై ఇపుడు ప్రశ్నలు తలెత్తాయి. ఎందుకంటే కాజల్ చేతిలో ప్రస్తుతం రెండు భారీ సినిమాలున్నాయి. ఒకటి.. ఆచార్య కాగా, ఇంకోటి ఇండియన్-2. వీటిని అగ్రిమెంట్ల ప్రకారం కంటిన్యూ చేయక తప్పదు. పెళ్లయిన వెంటనే కాజల్ ‘ఆచార్య’ కోసం పని చేయాల్సి ఉంది. అది సగంలోఆగిన ప్రాజెక్టు. ఇక ‘ఇండియన్-2’ కోసం కూడా ఇంకా చాలా కాల్ షీట్లే ఇచ్చేసింది. ఆర్నెల్లు భర్తకు సమయం ఇచ్చే పరిస్థితి లేదు.
ఇవి కాక కాజల్ మరో రెండు మూడు సినిమాలు ఒప్పుకుంది. అవి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. లేదా సమంత, శ్రియ, రాధికా ఆప్టే, కరీనా కపూర్, శకుంతలా దేవి లాంటి హీరోయిన్లను ఆదర్శంగా తీసుకుని కెరీర్ ను కొనసాగిస్తుందేమో మరి.