వివేకా హత్య కేసు.. విచారణకు బ్రేక్!

Andhra Oct 06, 2020

ఏపీ ముఖ్యమంత్రి బాబాయ్.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు బ్రేక్ పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. షాకింగ్ గా మారిన ఈ హత్య కేసు లెక్క త్వరగా తేలుతుందని భావించినా.. అనుకున్నంత వేగంగా సాగటం లేదని చెప్పాలి. ఇలాంటి వేళ.. మరో సమస్య ఈ కేసు విచారణకు అడ్డంకిగా మారింది.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న 15 మంది సీబీఐ అధికారుల్లో నలుగురికి కరోనా సోకి ఇంటికే పరిమితం కాగా.. తాజాగా మరో ముగ్గురు సైతం తాజాగా కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఈ కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా చెబుతున్నారు.  వివేకా హత్య కేసు విచారణలో భాగంగా పలువురు అనుమానితుల విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా సీబీఐ అధికారులు కడప జిల్లాకు వెళ్లారు.

ఆ క్రమంలోనే ఏడుగురు అధికారులు కరోనా బారిన పడ్డారు. దీంతో.. వారందరిని కడప సిటీలోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన సీబీఐ అధికారులు ఢిల్లీకి వెళ్లిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో.. కేసు విచారణ తాత్కాలికంగా నిలిచిపోయినట్లుగా చెబుతున్నారు. అధికారులంతా కోలుకొని సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత మాత్రమే విచారణ మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.