గత 15 ఏళ్లుగా టాలీవుడ్ లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ రాణిస్తోంది. అయితే, గత ఏడాది తన చిరకాల మిత్రుడు, ముంబై బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న చందమామ బ్యూటీ…ఆ తర్వాత రెండు పెద్ద ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. చిరుతో ఆచార్యలో నటిస్తున్న కాజల్…నాగ్ తో ఘోస్ట్ లో కూడా నటిస్తోంది. అయితే, ఆ రెండు ప్రాజెక్టుల తర్వాత మరో సినిమాకు కాజల్ సైన్ చేయలేదని, అందుకు కాజల్ ప్రెగ్నెన్సీనే కారణమని సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు, త్వరలోనే కాజల్ సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతోందని టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కాజల్ తన ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించింది. తన ప్రెగ్నెన్సీ విషయం గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదని, సమయం వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తానని చెప్పింది కాజల్. మాతృత్వం అనేది ఓ అద్భుతమైన అనుభూతి అని, తన చెల్లెలు నిషా అగర్వాల్ తల్లి కాబోతున్నప్పుడు ఎలా ఫీల్ అయింది, ఇప్పుడు తల్లి అయ్యాక ఎలా ఫీల్ అవుతుందో దగ్గరుండి చూశానని చెప్పింది.
నిషా కుమారుడు ఇషాన్ కు తల్లిని అనే భావనతో గడుపుతున్నానని, తనకంటూ ఓ బిడ్డ ఉంటే జీవితం ఎంతో అందంగా మారిపోతుందని కాజల్ చెప్పింది. అయితే, ఆ పుకార్లపై కాజల్ ఇచ్చిన క్లారిటీలో క్లారిటీ మిస్సయిందని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ, కాజల్ ప్రెగ్నెంటో కాదో క్లియర్ గా చెప్పలేదని కామెంట్లు చేస్తున్నారు. ప్రెగ్నెంట్ కాకుంటే..కాదని తేల్చి చెప్పేసేదని, మాతృత్వం గురించి మాట్లాడింది కాబట్టి కాజల్ ప్రెగ్నెంటేనని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా, ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే మాత్రం కాజల్ చెప్పిన సరైన సమయం..సందర్భం రావాల్సిందే.