జస్టిస్ రాకేష్ కుమార్… శుక్రవారం చేసిన వ్యాఖ్యలు చాాలా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే…
వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత రాజధానిని తరలించాలనుకోవడం మతిలేని చర్య కాదా? అమరావతిలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. నేరగాళ్లు రాజకీయాల్లోకి రాకుండా నిరోధించే చట్టం కఠినంగా ఉండాలి. ఈ వ్యాఖ్యలు నా వ్యక్తిగత వ్యాఖ్యలు అని రాకేష్ కుమార్ అన్నారు.
తనకు సంబంధం లేని రాష్ట్రంలో, రాబోయే నెలన్నరలో రిటైర్ అయ్యే జడ్జి ఇంత తీవ్రంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తెలుగు వాడు కాదు. పైగా రిటైర్ అవుతున్నారు. అయినా అలాంటి మాటలు అన్నారంటే… రాజధాని పరిస్థితి, రాష్ట్రానికి చెందిన కోట్లాది ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఆయన్ను ఎంత కలచివేసి ఉంటుందో కదా.
పోనీ ఆయనేమైనా అందరిలాంటి వ్యక్తా అంటే కాదు, నిజాయితీకి నిలువుటద్దం. తప్పు చేసిన పలువురు న్యాయమూర్తుల మీదే విచారణకు ఆదేశించిన నిక్కచ్చి మనిషి. అమరావతికి బదిలీ అయ్యేముందు ఏపీ ప్రజల గురించి ఆయన ఆరా తీశారట. వారు చైతన్యవంతులు అని ఆయనకు ఫీడ్ బ్యాక్ వచ్చిందట. కానీ… ఆయన ఇపుడు ఏపీ ప్రజల గురించి ఏమంటున్నారో తెలుసా?
రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలుకాకపోయినా ప్రజలు ఇంత స్తబ్ధుగా ఎందుకు ఉంటున్నారు. బిహార్లో కనీసం అధికారులైనా చట్టానికి లోబడి పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అధికారులు అది కూడా చేయడం లేదు – ఇవి రాకేష్ కుమార్ వ్యాఖ్యలు
ప్రభుత్వాలకు చట్టసభలలో ఎంత మెజార్టీ ఉన్నప్పటికీ చట్టాలు, రాజ్యాంగానికి లోబడే నడుచుకోవాలి. ఇది రాజ్యాంగం చదిని రఘురామరాజు వంటి వారికి అర్థమవుతుంది గాని నిత్యం గొడవలతో రాజకీయం చేసేవారికి ఎలా అర్థమవుతుంది? ఏది ఏమైనా… జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యలు ఏపీ ప్రజలు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో తెలియడానికి ఉదాహరణ.