• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్…జస్టిస్ కనగరాజ్ కు మరోసారి భంగపాటు తప్పదా?

65 ఏళ్లు దాటితే పీఏసీ చైర్మన్ గా అనర్హులు...జస్టిస్ కనగరాజ్ వయస్సు 75 ఏళ్లు

admin by admin
June 24, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
508
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జిగా పనిచేసి రిటైర్డ్ అయిన జస్టిస్ కనగరాజ్ పేను ఆంధ్రా ప్రజలకు సుపరిచితమే. ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదన్న కారణంతో రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తెచ్చి…నిమ్మగడ్డ స్థానంలో జస్టిస్ కనగరాజ్ ను నియమించింది జగన్ సర్కార్. అయితే, సుప్రీం కోర్టు తీర్పుతో నిమ్మగడ్డ తనకు రాజ్యాంగం హక్కుగా ఇచ్చిన పదవిని చేపట్టడంతో జస్టిస్ కనగరాజ్ కు భంగపాటు తప్పలేదు.

కట్ చేస్తే…జస్టిస్ కనగరాజ్ ను ఏపీ పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ కొద్ది రోజుల క్రితం జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, జగన్ సర్కార్ గత అనుభవాల నుంచి పాఠాలు నేర్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా నిబంధనలు అతిక్రమించి మరీ ఏపీ ప్రభుత్వం జస్టిస్ కనగరాజ్ ను నియమించిందన్న ప్రచారం జరుగుతోంది. జగన్ అనుభవరాహిత్యం వల్ల జస్టిస్ కనగరాజ్ కు మరోసారి భంగపాటు తప్పదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు కంప్లయింట్‌ అథారిటీ రూల్స్‌- 2020లోని సెక్షన్‌ 4(ఏ) ప్రకారం రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిని పీఏసీ చైర్మన్‌గా నియమించాలి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ,ఆ పదవిలో ఉండబోయే వారి వయసు నిబంధన దగ్గరే చిక్కు వచ్చి పడింది. పీఏసీ చైర్మన్…65 ఏళ్ల వయసు వచ్చేవరకు.. లేదంటే మూడేళ్లు.. ఏది ముందైతే అప్పటి వరకు ఆ పదవిలో ఉండొచ్చు. ఇక, పదవి చేపట్టేనాటికి 65 ఏళ్లు నిండిన వారు ఈ పోస్టుకు అనర్హులని రూల్స్ చెబుతున్నాయి.

కానీ, జస్టిస్ కనగరాజ్‌ వయస్సు దాదాపు 75 ఏళ్లు. కాబట్టి రూల్స్‌ ప్రకారం అయుతే ఆయన ఆ పోస్టుకు అనర్హులు. పీసీఏ చైౖర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌ మూడేళ్లు కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే, ఈ పదవి నుంచి దిగిపోయే నాటికి ఆయన వయస్సు దాదాపు 78 సంవత్సరాలు.దీంతో, జస్టిస్ కనగరాజ్ నియామకంపై నీలినీడలు కమ్ముకున్నాయని విమర్శలు వస్తున్నాయి.

అయితే, గతంలో నిమ్మగడ్డను పదవి నుంచి దించడానికి రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తెచ్చిన జగన్….అదే తరహాలో జస్టిస్ కనగరాజ్ నియామకం కోసం వయసు నిబంధనకు మార్పులుచేర్పులు చేసి మరో ఆర్డినెన్స్ తేవడం పెద్ద విషయమేమీ కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏమో…గుర్రం ఎగురా వచ్చు…జగన్ కు నచ్చిన ఆర్డినెన్స్ లు రానూ వచ్చు…తనపై ఉన్న క్రిమినల్ కేసులను జగన్ స్వయంగా కొట్టేసుకోనూ వచ్చు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.జస్టిస్ కనగరాజ్ ను మరోసారి జగన్ షాక్ తప్పదేమోనని విమర్శలు వస్తున్నాయి.

Tags: age relaxation issueap cm jagancontroversypca chairmanretd justice kanagaraj
Previous Post

జగన్ కు సుప్రీం వార్నింగ్…అలా జరిగితే రూ.కోటి ఫైన్

Next Post

విద్యార్థుల పాలిట విల‌న్ జ‌గ‌న్‌..హీరో నారా లోకేష్‌

Related Posts

ys jagan
Andhra

సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!

March 30, 2023
Top Stories

వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్

March 29, 2023
Trending

వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

March 29, 2023
Trending

టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్

March 29, 2023
Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Trending

టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?

March 29, 2023
Load More
Next Post

విద్యార్థుల పాలిట విల‌న్ జ‌గ‌న్‌..హీరో నారా లోకేష్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!
  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!
  • టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్
  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra