ఏపీ లో జరుగుతున్న విషయాలను తెలుసుకోకుండా, ఏపీ ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా, ఏపీలోని దళితులపై జరుగుతున్న దమన కాండ తెలుసుకోకుండా, నడిరోడ్డుపై మనిషిని నలుగురు పట్టుకుని రాళ్లతో బాదుతున్నా పట్టించుకోలేని ఏపీ పోలీసు వ్యవస్థ ఉన్న విషయం తెలుసుకోకుండా… ఏపీ హైకోర్టును తప్పు పడుతు జస్టిస్ చంద్రు కొన్ని కామెంట్లు చేశారు.
అసలు ఏపీలో జరిగేవి ఆయనకు తెలిసే అవకాశం తక్కువ. కనీసం ఏపీ గురించి రాసేటపుడు, మాట్లాడేటపుడు ఈ రెండున్నరేళ్లలో ఏపీలో ఏం జరిగిందో తెలుసుకుని ఆయన మాట్లాడి ఉంటే బాగుండేది.
ఆయన ఏపీ హైకోర్టు గురించి మాట్లాడటమేకాదు, ఏపీ గురించి హిందులో ఒక ఆర్టికల్ రాశారు. దానిని చదివిన అనంతరం గంగాధర్ తాటి అని ఒక ఏపీ పౌరుడు వ్యక్తపరిచిన ఈ అనుమానాలు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ ప్రశ్నలు చదివాక… అసలు ఏపీ పై ఎవరి ప్రోద్బలంతో అయినా చంద్రు ఇలా స్పందిస్తున్నారా అన్న అనుమానాలు పలువురు నెటిజన్లు వ్యక్తంచేస్తున్నారు.
1. ఆ ఆర్టికల్ లో మీరు .. చంద్రబాబు ప్రభుత్వం రాజధానికి 33 వేల ఎకరాలు సమీకరించి .. ఇంకో 50 వేల ఎకరాలు తీసుకోబోయింది .. అందుకు అక్కడ పెద్ద ఎత్తున రైతులు ప్రొటెస్ట్ చేశారని రాశారు
ఇంకో 50 వేల ఎకరాలు చంద్రబాబు ప్రబుత్వం సేకరించబోయిందని ఎక్కడ చూశారు మీరు ? ఏనాడైనా బాబు ప్రబుత్వం చెప్పిందా ? ఏ ఎవిడెన్స్ బేస్ చేసుకొని మీరిది రాశారు
రెండవది .. పెద్ద ఎత్తున రైతులు ప్రొటెస్ట్ చెశారన్నారు .. ఎప్పుడు చేశారో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి .. బాబు ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ / నిర్భందాలు ఏమైనా వున్నాయా ? స్వతంత్ర భారత చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున భూమి లాఠీ చార్జ్ జరగకుండా .. రూపాయి కూడా ఇవ్వకుండా సేకరించటం ఎప్పుడైనా జరిగిందా ?
2. మీరు ఈ ఆర్టికల్ లో రాసిన ఇంకోటి .. రైతుల్లో వున్న అశాంతిని అడ్వాంటేజ్ గా తీసుకొని .. జగన్ మూడు రాజధానుల ప్లాన్ తో వచ్చారన్నరు
రాజధాని మారుస్తామని జగన్ ప్రతిపక్షంలో వుండగా లేదా కనీసం ఎలక్షన్ ప్రచారంలోనైనా చెప్పారా ? లేదు కదా ? అసలు రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని సజస్ట్ చేసిందీ జగనే .. దీన్ని రాజధానిగా వారు వారి పార్టీ మొత్తం అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు .. అధికారంలోకి రాగానే .. రాజధాని మార్పు అన్నారు .. ఇది రైతులలో వున్న అశాంతిని అడ్వాంటేజ్ గా తీసుకొటమంటారా లేక అధికార బలాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోటమంటారా ?
రైతులలో అశాంతి ఎప్పుడుంది ? 144 సెక్షన్ తో నిర్భందాలు పెట్టిన ఇప్పుడా లేక బాబు హయాంలోనా ? గత 700 రోజులుగా వారు ప్రొటెస్ట్స్ ఎందుకు చేస్తున్నారు ? ఎప్పుడు అశాంతి వున్నట్టు ?
3. మీరు .. న్యాయవ్యవస్త మీద కామెంట్స్ చేసిన వారిని అరెస్ట్ చెయ్యటం ఇతరత్రా మీద AP హైకోర్ట్ ఫంక్షనింగ్ మీద సునిచిత విమర్శలు చేసారు
అసలు వారు న్యాయవ్యవస్తపై చేసిన కామెంట్స్ మీరు చూశారా ? AP హైకోర్ట్ ని వదిలెయ్యండి .. సుప్రీంకోర్ట్ లాయర్ హరీష్ సాల్వే దీనిని ఎందుకంత సీరియస్ గా తీసుకున్నారు ? న్యాయవ్యవస్తపై కామెంట్స్ చేసిన వారి గురించి హరీష్ చేసిన వ్యాఖ్యలు మీరు చూడలేదా ? ఆయన జగన్ మోహన్ రెడ్డి కేసులు వాదించే లాయర్లలో ఒకడు కూడా .. అయినా ఆయన అంత సీరియస్ ఎందుకయ్యారు ?
వీటిలో వేటి మీదైనా మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ వుందా ? ఎందరికో ఇన్స్పిరేషన్ అయిన మీలాంటి గొప్ప వ్యక్తి .. ఇలా
గత ప్రభుత్వం 33 వేల ఎకరాలు సేకరించి, మరో 50 వేల ఎకరాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తే రైతులు తిరుగుబాటు చేసారని ఓ అబద్దాన్ని చెబుతూ.. ఆ రైతులకు నష్టం కలిగించకూడదని 3 రాజధానుల బిల్ ఈ ప్రభుత్వం తెచ్చిందని ఇంకో అబద్దాన్ని సమర్దిస్తూ రాయటం దారుణమైన విషయం
– గంగాధర్ తాటి, ఏపీ పౌరుడు
హరీష్ సాల్వే గారి ఏపీలో అరాచకం గురించి మాట్లాడిన వీడియో
చంద్రు గారు,న్యాయవ్యవస్తపై కామెంట్స్ చేసిన వారిని అరెస్ట్ etcపై,APహైకోర్ట్ ఫంక్షనింగ్ పై మీరు సునిచిత విమర్శలు చేసారు
అసలు వారు న్యాయవ్యవస్తపై చేసిన కామెంట్స్ చూశారా?AP హైకోర్ట్ ని వదిలెయ్యండి,సుప్రీం లాయర్&జగన్ కేసులు వాదించే లాయర్లలో ఒకడైన హరీష్ కూడా,ఇలా????సీరియస్ ఎందుకయ్యారు? https://t.co/Mkgrx5hNzi pic.twitter.com/3u0DviaZCA
— Gangadhar Thati (@GangadharThati) December 11, 2021