సెల్ ఫోన్ కు సంబంధించి చూస్తే.. అంబానీల ఎంట్రీకి ముందు.. ఎంట్రీ తర్వాత అన్న వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి.
ఈ దీపావళికి మార్కెట్లోకి రానున్న జియో స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన వివరాలు.. ఆ సంస్థ విడుదల చేసిన ధరల్ని చూస్తే.. వెంటనే ఒక స్మార్ట్ ఫోన్ కొనేయాలన్న భావనకు రావటం ఖాయం. ఎందుకంటే.. ఈస్మార్ట్ ఫోన్ ధర కారు చౌకగా ఉండటం. ఇంతకీ ధర ఎంతంటారా?
కేవలం రూ.1999 మాత్రమే. కాకుంటే చిన్న కండీషన్ ఉంది.
రెండు వేలు చేతిలో పెట్టి స్మార్ట్ ఫోన్ తీసుకున్న తర్వాత.. ఫోన్ ఖరీదును 18 నెలలు లేదంటే 24 నెలల పాటు చెల్లించేలా ప్లాన్ చేశారు.
మార్కెట్లోకి జియో సిమ్ కార్డు వచ్చిన తర్వాత.. ఒకట్రెండు సిమ్ లు ఉన్నా.. కచ్ఛితంగా జియో సిమ్ ను తీసుకోవటం ఒక అలవాటుగా మారింది.
ముకేశ్ అంబానీ జియో స్మార్ట్ ఫోన్ వ్యూహం చూస్తే.. చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కు ఈ ఫోన్ అదనం కావటం ఖాయమని చెప్పాలి.
నిజానికి చిప్ ల కొరత లేకుండా మరింత తక్కువ ధరకే లభ్యమయ్యేది. కానీ.. చిప్ కొరత కారణంగా ధర కాస్త పెరిగినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం నిర్ణయించిన దాని ప్రకారం జియో స్మార్ట్ ఫోన్ ధర రూ.6499గా డిసైడ్ చేశారు.
రూ.1999 కట్టేసిన తర్వాత చేతికి జియో స్మార్ట్ ఫోన్ వస్తుంది. దీన్ని తీసుకొని 18-24 నెలల్లో ఎవరికి ఏ ప్లాన్ అనువుగా ఉంటుందో దాన్ని ఎంచుకొని మిగిలిన మొత్తాన్ని వాయిదాల రూపంలో కట్టేయొచ్చు.
ఇందుకోసం జియో నాలుగు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అంతేకాదు.. అండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్ ను గూగుల్ దీని కోసం డెవలప్ చేసింది.
ఇందులో పెద్దగా చదవటం.. ట్రాన్స్ లేట్ చేసే ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అంతేకాటు.. జియో సినిమా.. జియో టీవీ.. జియో సావన్ తో పాటు మరికొన్ని యాప్ లను డౌన్ లోడ్ చేసుకునే వీలుంది.
మొదటి ప్లాన్ ను ఎంపిక చేసుకుంటే.. అయితే రూ.300 లేదంటే రూ.350 చెల్లించాలి.
కనిష్ఠంగా 18 నెలలు గరిష్ఠంగా 24 నెలలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించిన వారికి నెలకు 5 జీబీ డేటాతో పాటు 100 నిమిషాల టాక్ టైం పొందే వీలుంది.
రెండో ప్లాన్‌లో.. ఇందులో 18 నెలల్లో ఫోన్ బాకీ తీరుస్తామనే వారు రూ.500.. 24 నెలల పాటు ఫోన్ కిస్తీ కట్టాలని డిసైడ్ అయితే నెలకు రూ.450 చెల్లించాలి.
ఈ ప్లాన్ లో రోజుు 1.5 జీబీ 4జీ డేటా.. అపరిమితమైన వాయిస్ కాల్ చేసుకునే వీలుంది.
మూడో ప్లాన్.. దీనికి ఓకే అనుకునే వారు 18 నెలల్లో ఫోన్ కిస్తీ కట్టేవారు రూ.550.. 24 నెలల పాటు కిస్తీ కట్టాలనుకుంటే రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
ఇందుకు ప్రతి రోజు 2జీబీ హైస్పీడ్ 4జీ డేటా.. అపరిమితమైన వాయిస్ కాల్స్ కు వీలుంది.
నాలుగో ప్లాన్.. ఇందులో ఫోన్ కొన్న వారు నెలకు రూ.600 చొప్పున 18 నెలలు.. రూ.550 చొప్పున 24 నెలలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇందుకోసం రోజుకు 2.5 జీబీ డేటాతో పాటు అపరిమితమైన ఫోన్ కాల్స్ చేసుకునే వీలుంటుంది.
జియో స్మార్ట్ ఫోన్లో ఫీచర్లు
డిస్ప్లే: 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 )
స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్
ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్
ర్యామ్,స్టోరేజ్ : 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు
బ్యాక్ కెమెరా: 13 ఎంపీ
ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ
బ్యాటరీ: 3500 ఎంఏహెచ్
సిమ్ స్లాట్లు: 2 సిమ్ లు వేసుకోవచ్చు
సిమ్: నానో
కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం
సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్