దివికెగిసిన అలనాటి అందాల తార శ్రీదేవి, ప్రముఖ బడా నిర్మాత బోనీ కపూర్ ల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తల్లి కోరిక మేరకు `దఢక్` అనే హిందీ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ పాప.. ఆ తర్వాత వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం `గుడ్ లక్ జెర్రీ`, `మిలి` అనే చిత్రాల్లో ఆమె నటిస్తోంది. అలాగే వరుణ్ ధావన్ తో `బవాల్` అనే మూవీ చేస్తోంది. జాన్వీ ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో ఇదే పెద్ద సినిమా కావడం విశేషం.
ఈ మూవీ గనుక మంచి విజయం సాధిస్తే బాలీవుడ్ లో జాన్వీ కెరీర్ పరంగా సూపర్ స్వింగ్ లో దూసుకుపోతుందని అంటున్నారు. మరోవైపు జాన్వీ సౌత్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే బోనీ కపూర్ కూతురిని గ్రాండ్ గా సౌత్ లోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జాన్వీ కపూర్ ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. అలాగే తల్లి మరణం తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో కూడా ఆమె తెలియజేసింది.
జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. `తినడం, తిరగడం, నటించడం ఈ మూడు అంశాలు నాకు మహా ఇష్టం. నచ్చిన ఫుడ్ ను కడుపునిండా తింటా. అదే టైమ్ లో శరీరాన్ని అందంగా, ఫీట్ గా ఉంచుకోవడానికి రెగ్యులర్ గా వర్కవుట్స్ చేస్తా. జర్నీ చేయడం అంటే ఎంతో ఇష్టం. షూటింగ్ నుంచి ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఏదో ఒక ప్రదేశానికి వెళ్లిపోతా.` అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే నటన గురించి చెబుతూ.. `ప్రేక్షకులను అలరించేందుకు నటించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. కానీ, నలుగురి మధ్య సెలబ్రెటీగా జీవించడం కష్టంగా ఉంటుంది. అందరి చూపులు మనపైనే ఉంటాయి. ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా రకరకాల కథనాలతో హైలెట్ చేస్తుంటారు. ట్రోల్స్ చేస్తారు. సెలబ్రిటీ అయినా, సాధారణ వ్యక్తి అయినా.. ఎవరి లైఫ్ వారిదే. మేము కొంత ప్రైవసీను కోరుకుంటాము. దాన్ని అందరూ అర్థం చేసుకోవాలి` అని జాన్వీ పేర్కొంది. ఇక తల్లి చనిపోయాక జీవితం మొత్తం మారిపోయిందని, సమాజం అంటే ఏంటో తెలిసొచ్చిందని ఆమె తెలిపింది. దీంతో ఇప్పుడు జాన్వీ కపూర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
https://twitter.com/GMGokulOfficial/status/1523937548447678464
With @aliaa08 ❤
Who's Your Favorite Heroine's..?
????#AliaBhatt = RT ????
❤ #JhanviKapoor = LIKE ???? pic.twitter.com/kewy55yXkX
— Janhvi Kapoor 0fficial (@im_JhanviKapoor) May 7, 2022