న్యూయార్క్ లో జరిగిన ఒక రిచ్ వెడ్డింగ్ లో మెగా బిలియనీర్ బిల్ గేట్స్ కూతురు తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
బిల్ గేట్స్ మరియు అతని మాజీ భార్య మెలిండా గేట్స్ సమక్షంలో పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ తన ఫియాన్స్న నాయెల్ నాసర్‌ను పెళ్లాడింది.
న్యూయార్క్‌లోని నార్త్ సేలంలోని 142 ఎకరాల తన ఇంటి ఆవరణలో శుక్రవారం రాత్రి ఈ పెళ్లి జరిగింది.
వరుడి కోరిక మేరకు ముస్లిం సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక జరిగింది.
25 ఏళ్ల జెన్నిఫర్ ఇక వివాహ జీవితాన్ని ప్రారంభించనుంది.
బిల్ గేట్స్ సవతి తల్లి, మిమి గార్డనర్ గేట్స్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
27 సంవత్సరాల వివాహం తర్వాత తాము విడిపోతున్నట్లు బిల్ మరియు మెలిండా ప్రకటించిన కొద్ది నెలలకే పెద్ద కూతురు పెళ్లి చేసుకోవడం, వారిద్దరు కలిసి పెళ్లికి హాజరు కావడం ఇక్కడ గమనార్హం.
మీడియా నివేదికల ప్రకారం ఈ పెళ్లి ఖర్చు రూ. 15 కోట్లు మాత్రమే. అంటే మన గాలి జనార్దన్ రెడ్డి చేసిన ఖర్చులో పదో వంతు కూడా బిల్ గేట్స్ ఖర్చు చేయలేదన్నమాట 🙂