ఔను.. వచ్చే ఎన్నికల్లో అనేక కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా.. విశాఖపట్నం కేంద్రంగా.. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.. రాజకీయ దూకుడు పెంచనున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను మాత్రమే కాకుండా.. తన కుమార్తెను కూడా రంగంలోకి దింపుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తానే రంగంలోకి దిగుతున్నట్టు వీవీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఇక, తన కుమార్తె.. ప్రియాంక దండి కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నార ని చెప్పిన ఆయన విశాఖ ఈస్ట్ అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్లు ప్రకటించేశారు. అంటే మొత్తంగా.. ఇద్దరూ కూడా స్వతంత్రంగానే రాజకీయాల్లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
ఇది మంచి పరిణామమే అయినా.. మాజీ జేడీ నమ్ముకున్న సిద్ధాంతాలు.. ప్రస్తుత తరానికి ఏమేరకు పనికి వస్తాయనేది ప్రధానంగా చర్చిస్తున్నారు. జేడీ చెబుతున్నట్టు.. తెన్నేటి విశ్వనాథం విశాఖ నుంచి స్వతంత్రంగా పోటీ చేశారని.. సోతాను కూడా అంతేనని ఆయనతో పోల్చుకుంటున్నారు. నిజమే.. కానీ ఇది జరిగి మూడు దశాబ్దాలు అయిపోయింది. ఇంకా అంతకు మించి కూడా అయి ఉండొచ్చు.
కానీ అప్పటి ప్రజల్లో స్వతంత్ర భావాలు.. దేశం కోసం.. ఏదైనా చేయాలనే ఉత్సాహం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. కానీ, నాయకులే వాటిని పాడుచేశారు. దీంతో ప్రజలు కూడా.. తమ మానాన తాము ఉంటున్నారు. సో.. జేడీ చెబుతున్న ఫార్ములా వర్కవుట్ కావడం కష్టమేనని అంటున్నారు. గత ఎన్నికల్ఓ జనసేన తరఫున పోటీ చేసిన ఆయన 100 రూపాయల బాండు పేపర్‌పై ప్రజలకు తాను గెలిస్తే..ఏం చేస్తానో వివరించారు. కానీ ప్రజలు పట్టించుకోలేదు. ఓడించారు. మరి ఈ నేపథ్యంలో ప్రజలను ఎలా తనవైపు తిప్పుకుంటారో చూడాలి.